9మందికి చేరిన కల్తీకల్లు మృతుల సంఖ్య

On
9మందికి చేరిన కల్తీకల్లు మృతుల సంఖ్య

  • ఇప్పటికే 5గురు అధికారులపై వేటు వేసిన ఎక్సైజ్ అధికారులు
  • 5 మంది షాప్ యజమానుల అరెస్ట్

కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. మృతుల సంఖ్య 9కి చేరింది.ఇప్పటికే ఈ కేసులో బాలానగర్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ ని సస్పెండ్ చేయగా, మరో 5 అధికారులపై చర్యలకు సిద్ధమైనారు. ఇక ఈ కేసులో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అయిదు మందిని అరెస్ట్ చేశారు. ఎస్.పి నగర్ కల్లు దుకాణం యజమాని కూన సాయి తేజ గౌడ్, శంశీగుడా, ఇందిరానగర్ నగర్ యజమాని నగేష్ గౌడ్, హైదర్ నగర్ యజమానులు కూన రవితేజ గౌడ్, కూన సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కల్లులో మత్తు వచ్చేలా ఆల్ఫాజాలం అనే మత్తు మందు కలపడం వల్లే ఈ అనర్ధం వాటిల్లిందని నారాయణగూడ ల్యాబ్ రిపోర్ట్ అధికారులకు అందింది. అది కూడా కేవలం ఒక్క రోజు కలపడం కాకుండా నిత్యం ఆల్ఫాజోలం కలిపిన మత్తు మందు కలిపిన కల్తీ కల్లు తాగడం వెళ్లే బాధితుల సంఖ్య పెరిగిందని ల్యాబ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ కల్తీ వ్యవహారంతో ఎక్సైజ్ శాఖకి ఉన్న పేరు కాస్త పోయిందనే చెప్పాలి. అటు ప్రభుత్వం సీరియస్, ఇటు ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడంతో అధికారులు పోయిన పరువును తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. అందుకే మొదట తమ శాఖ నుండే చర్యలు చేపట్టారు. నిఘా వైఫల్యం కారణం అని తమ సిబ్బందిపై వేటు వేశారు. రెండో ఎపిసోడ్ లో కల్లు దుకాణం యజమానులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. అయితే ఇలాంటి చర్యల వల్ల ఒరిగేది ఏమి లేదని, ఎక్సైజ్ అధికారులు నిఘా నిరంతరం కొనసాగించాలని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సస్పెండ్ అయిన అధికారికి మళ్లీ పోస్టింగ్ వస్తుంది..  జైల్ కి వెళ్లిన వ్యక్తులు బెయిల్ పై విడుదల అవుతారు.. కానీ పోయిన ప్రాణం మళ్లీ రాదు కాబట్టి వారంతా అధికారులతో సహా జైల్ లోనే మగ్గేలా ఉన్నతాధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని అన్నారు. మొత్తానికి డ్రగ్స్, గంజాయితో పాటు కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సిటీలో అంటే విషయం బయట పడింది. కానీ శివారు ప్రాంతాల్లో చెట్ల కింద కూడా ఇలాగే కల్తీ వ్యవహారం సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వాటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisement

Latest News

మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం! మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?