ప్రశాంతంగా సాగిన బీబీ కా ఆలం ఊరేగింపు..

On
ప్రశాంతంగా సాగిన బీబీ కా ఆలం ఊరేగింపు..

IMG-20250706-WA0123మొహర్రం సంతాప దినాలలో భాగంగా, ఈరోజు 10వ మొహర్రం సందర్భంగా జరిగిన బీబీ కా ఆలం ఊరేగింపు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది.  శ్రీ సి.వి. ఆనంద్ ఐపిఎస్ డిజి మరియు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్వయంగా చారిత్రక చార్మినార్ వద్ద ఉండి బందోబస్తును పర్యవేక్షించారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా అధికారులందరికీ ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందించారు. గత 10 రోజుల నుండి మొహర్రం సంతాప దినాలకు శ్రీ సి.వి. ఆనంద్  అధ్వర్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టారు. బీబీ కా ఆలం యొక్క ఈ భారీ ఊరేగింపు డబీర్‌పురా(దారుల్ షిఫా) లోని ఆషుర్‌ఖానా నుండి ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకువచ్చిన లక్ష్మి ఏనుగుపై "ఆలం"ను ఉంచి ఈ యాత్ర కొనసాగింది. అనంతరం ఈ ఊరేగింపు మూసీ నది ఒడ్డున ఉన్న మసీద్-ఎ-ఇలాహీ, చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది. నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సీనియర్ అధికారులతో కలిసి ఊరేగింపును పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున చార్మినార్ వద్ద ఆలంకు పూలమాలలు మరియు దట్టీలు సమర్పించారు. ఈ బిబీకా ఆలం ఊరేగింపుకు 3,000 మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలతో అన్ని చర్యలు చేపట్టడం వలన హైదరాబాద్‌లో బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా  సి.వి. ఆనంద్ ఐపిఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్‌లోని షియా కమ్యూనిటీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  విక్రమ్ సింగ్ మాన్ ఐపిఎస్ (అదనపు కమిషనర్ ఆఫ్ పోలీసు L&O), డి. జోయెల్ డేవిస్ ఐపిఎస్ (జాయింట్ సిపి ట్రాఫిక్),  రక్షిత కృష్ణ మూర్తి ఐపిఎస్ (డిసిపి CAR హెడ్‌క్వార్టర్స్),  స్నేహా మెహ్రా ఐపిఎస్ (డిసిపి  సౌత్ జోన్) తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే! వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్‌ కొనసాగుతున్న యూపీలో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘బుల్లెట్‌ రాజ్‌’తో బుద్ధి చెబుతున్నారు. శాంతిభద్రతలు కాపాడటంతోపాటు నేరనిర్మూలనే లక్ష్యంగా నేరస్థులపై కఠిన...
మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!