నైజీరియన్స్ తో మొత్తం నెట్ వర్క్ నడిపించారు

On
నైజీరియన్స్ తో మొత్తం నెట్ వర్క్ నడిపించారు

  • మల్నాడు డ్రగ్స్ కేసులో బయటపడ్డ మరో ట్విస్ట్
    హోటల్ యజమాని సూర్యకు సహకరిస్తున్న నైజీరియన్స్
    పోలీసుల అదుపులో ఇద్దరు, మరో నలుగురి కోసం మొదలైన వేట

AISelect_20250712_062927_ChromeBy. V. Krishna Kumar
Tpn: స్పెషల్ డెస్క్
మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. దర్యాప్తులో అధికారులకు సైతం అంతుచిక్కని రహస్యాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ నెట్ వర్క్ అంతా ఢీల్లీ, గోవా నుండి సాగిందని తేలింది. ఇందుకు హోటల్ యజమాని సూర్యకి ఏజెంట్లుగా నైజీరియన్స్ యువతులు సహకరించినట్లు తెలిసింది. మొత్తం ఆరుగురిలో ఇద్దరిని ఈగల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. సిటీలో మొత్తం 60 మంది నైజీరియన్స్ ఉండగా ఇటీవలే అధికారులు అందరినీ వారి వారి ప్రాంతాలకు పంపించారు. వీరిలో ఆరుగురు మాత్రం సిటీలో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నట్లు ఈ కేసు వెలుగు చూసిన తరువాత పోలీసులకు తెలిసింది. వారంతా మల్నాడు కిచెన్ యజమానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు బలవంతంగా హైదరాబాద్ నుండి పంపించిన తరువాత ఢిల్లీ, గోవాకు చేరిన నైజీరియన్స్ యువతులు సిటీలో ఉన్న ఆ ఆరుగురికి డ్రగ్స్ సరఫరా చేయడం వారి ద్వారానే కమిషన్ రూపంలో సూర్య విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈగల్ తో పాటు, సిటీ కమీషనరేట్ లో పని చేస్తున్న  హెచ్ న్యూ పోలీసులు కూడా ఈ కేసులో రంగంలోకి దిగారు. తప్పించుకు తిరుగుతున్న ఆ నలుగురు ఎక్కడ అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నైజీరియన్స్ యువతులు అసలు విషయం బయటపెట్టారు. నగరంలో పేరు మోసిన డాక్టర్లకు, వ్యాపారవేత్తలకు డ్రగ్స్ అమ్మినట్లు ఎంత అమ్మితే అంతకు దగ్గ కమీషన్ సూర్య ఇచ్చేవాడని తెలిపారు. అంతే కాకుండా డ్రగ్స్ తీసుకునే రెగ్యూలర్ కస్టమర్లకు తమను పంపి వ్యభిచారం కూడా చేయించి డబ్బులు తీసుకున్నట్లు ఆ ఇద్దరు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పడి వరకు డ్రగ్స్ అమ్మకాలపై ఫోకస్ పెట్టిన ఈగల్ అధికారులు ఇప్పుడు ఢిల్లీ, గోవాలో ఉన్న నైజీరియన్స్ కోసం వివరాలు సేకరిస్తున్నారు. అంతే కాకుండా పట్టుబడిన వారి సెల్ ఫోన్ల నుండి కాల్స్ లిస్టే సేకరించి డ్రగ్స్ వాడుతున్న డాక్టర్లు, వ్యాపారవేత్తల వివరాలు సేకరించారు. వారిని సైతం ఈ కేసులో అరెస్టు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కొందరు మల్నాడు కిచెన్ వ్యవహారం తెలియడంతో పరారీలో ఉన్నట్లు తెలుసుకున్న ఈగల్ హెచ్ న్యూ అధికారులతో కలిసి దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తానికి తీగలాగితే డొంకంతా కదిలినట్లు మల్నాడు కిచెన్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. దీని కింగ్ పిన్ సూర్యతో పాటు, డ్రగ్స్ సప్లయర్స్, కస్టమర్లందరీకీ ఫుల్ స్టాప్ పెట్టాలని ఈగల్ వడివడిగా అడుగులు వేస్తోంది. 
 

Advertisement

Latest News

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..! దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!
నగరాన్ని ముంచెత్తిన వానఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణశాఖభారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్‌ ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం  
వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!