మళ్లీ తెరపైకి ఫాతిమా ఒవైసీ కాలేజ్ వివాదం
By V KRISHNA
On
- ఎఫ్టిఎల్ లో నిర్మాణం అంటూ తేల్చి చెప్పిన హైడ్రా
అప్పుడు హడావిడి.. ఇప్పుడు మౌనం ఎందుకంటూ ప్రశ్న
దమ్ముంటే కూల్చమంటూ డిమాండ్ చేసిన బిజేపి అధ్యక్షుడు
లోపాయికారి ఒప్పందం అంటూ ప్రచారం.

Tpn: స్పెషల్ డెస్క్..
మళ్లీ ఫాతిమా ఒవైసీ కాలేజ్ వివాదం తెరపైకి వచ్చింది. చెరువులో నిర్మించిన ఈ కాలేజ్ విషయంలో హైడ్రా ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రచారం సాగుతోంది. గతంలో హడావిడి చేసిన రంగనాథ్ వారితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడా అని బిజేపి ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వంతో చేతులు కలపడంతోనే ఫాతిమా కాలేజ్ వదిలేశారా.. జనాలకు రూల్ ఒకలా.. ఫాతిమా కాలేజ్ కి ఒకలా చట్టాలు రూపొందించారా అంటూ బిజేపి నూతన అధ్యక్షుడు రాంచదర్ రావు ప్రశ్నిస్తున్నారు. హైడ్రాకు చిత్తశుద్ది ఉంటే వెంటనే చెరువులో నిర్మాణం జరిగిన ఫాతిమా కాలేజ్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మరోసారి కాలేజ్ వివాదం మొదలైంది. పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో ఉన్నసలకం చెరువు దాదాపు 0.37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాగా 70శాతం కబ్జాలకు గురైంది. అంటే 0.111 చదరపు కిలోమీటర్లకు కుదించుకు పోయింది. సుమారు 0. 258 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కబ్జాకు గురైంది. ఇందులో బహుళ అంతస్తు భవనాలతో పాటు అక్బరీద్దీన్ ఒవైసీ బ్రదర్స్ 2017లో 12 భవనాలు నిర్మించారు. అందులో ఫాతిమా ఒవైసీ కాలేజ్ నడిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చెరువుల ఆక్రమిత ప్రాంతాలను పరిశీలించి వాటిని నేలమట్టం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ తో పాటు అనేక బహుళ అంతస్తు భవనాలు నేలమట్టం చేశారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. ఆ తరువాత హైడ్రా రికార్డుల ప్రకారం సలకం చెరువులో ఒవైసీ బ్రదర్స్ చేపట్టిన మెడికల్ కాలేజ్ ఎఫ్ టిఎల్ పరిధిలో ఉందని తేల్చింది. 1979 నుండి 2023 వరకు శాటిలైట్ ద్వారా వివారాలు హైడ్రా సేకరించింది. దీన్ని సైతం నేలమట్టం చేయాలని సంకల్పించింది. అప్పట్లో ఫాతిమా కాలేజ్ నెక్స్ట్ హైడ్రా టార్గెట్ అంటూ పెద్ద దుమారం రేగింది. దీనిపై చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి అసెంబ్లీ వేదికగా నానా రభస చేశాడు. కాలేజ్ జోలికి వస్తే సహించేది లేదని, దాన్ని అడ్డుకుంటామని, అవసరమైతే సిటీని రణరంగంగా మార్చుతామని హెచ్చరించాడు. ఈ కాలేజ్ లో ప్రతి ఏడాది 10వేల మందికి పైగానే తాము పేద విద్యార్థులకు కేజీ టు పిజీ వరకు ఉచితంగా విద్యా అందిస్తున్నామని, కూల్చివేత చేస్తే విద్యార్థులంతా రోడ్డున పడతారని అన్నారు. దీన్ని తాము ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు.
లోపాయికారి ఒప్పందం జరిగిందా?
అప్పటి వరకు నానా హడావిడి చేసిన హైడ్రా ఒక్కసారిగా ఆ కాలేజ్ విషయంలో వెనక్కి అడుగు వేసిందని ప్రచారం మొదలైంది. హైడ్రా ఏర్పాటు జరిగి జూలై 18కి ఏడాది పూర్తవుతుంది. మరి అన్ని చెరువులపై పడ్డ హైడ్రా సలకం చెరువు విషయం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం జరిగిందా.. కాంగ్రెస్, ఎంఐఎం భాయ్ భాయ్ అనే సరికి దాన్ని వదిలేశారంటూ ప్రతి పక్షాలు, జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. అప్పొసొప్పొ చేసి తెలిసీ తెలియక ఇండ్లు కొనుగోలు చేసిన వారిని రోడ్డున పడేయడం, మూసీ ప్రక్షాళన అంటూ దాని పరివాహాక ప్రాంత వాసులను వీధిలోకి విసిరేసే హైడ్రా ఫాతిమా ఒవైసీ కాలేజ్ పై ఎందుకు సవతి ప్రేమ చూపిస్తోందని బిజేపి నూతన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నేలమట్టం చేసి చెరువుకి మోక్షం కలిగించాలని అన్నారు. లేదంటే లోపాయికారి ఒప్పందాలు రంగనాథ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ ఒప్పందంలో నిజమెంత?
ఇదిలావుంటే ఫాతిమా కాలేజ్ కి బదువులు సంతోష్ నగర్ చౌరస్తాలో ఉన్న ఒవైసీ ఆసుపత్రి స్థలం మెట్రో నిర్మాణం కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, అందుకు బదులు ఆ కాలేజ్ జోలికి వెళ్లడం లేదని విషయం కూడా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఈ విషయంపై అక్బరీద్దీన్ కోర్టు నుండి స్టే తెచ్చాడంటూ ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా అందరూ మర్చిపోయారని భావిస్తున్నా హైడ్రాకు మరోసారి ఫాతిమా కాలేజ్ వ్యవహారం రచ్చకావడం మింగుడు పడని వ్యవహారంలా మారిపోయింది. బడుగు, బలహీన వర్గాలు, పేద, మధ్య తరగతి కుటుంబాలను గృహప్రవేశం రోజునే రోడ్డున పడేసేందుకు హైడ్రా ఏర్పాటు జరిగిందా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మరీ వారందరీ ప్రశ్నలకు రంగనాథ్ సింపుల్ గా సమాధానం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని అందుకే వెనకడుగు వేసినట్లు చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో ఆ సలకం చెరువుకే తెలియాలి.

Related Posts
Latest News
09 Jul 2025 08:33:45
* అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులు బలి కావాలా?* 2020–21లో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఏర్పాటు * నాలుగేళ్లయినా అనుమతులు తెచ్చుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం?* అనుమతులు...