దాడులతో దడ పుట్టించిన ఎక్సైజ్ అధికారులు.. భారీగా గంజాయి స్వాధీనం..
నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి దడ పుట్టించారు. ముడుచోట్ల హెచ్టిఎఫ్ టీమ్‌లు, ఎక్సైజ్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో 3.338 కేజీల గంజాయిని సీజ్ చేశారు.
మల్కాజిగిరిలో..
మల్కాజి గిరి ప్రాంతంలో ఎస్టిఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది కలిసి నిర్వహించిన దాడిలో 1.120 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ప్రైవేట్ ఉద్యోగి శివ కుమార్ సమాచారం మేరకు స్క్రూటిపై గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది.
ఈ కేసులో ప్రశాంతనగర్‌కు చెందిన హరిని, విజయవాడకు చెందిన అఖిల్ అరెస్టు చేసి వారి వద్ద ఉన్న గంజాయిని, స్క్రూటిని, సెల్‌ఫొన్లను స్వాధీనం చేసుకొని మల్కాజి గిరి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ధూల్‌పేట్‌లో 1.280 గంజాయి పట్టివేత..
ధూల్‌పేట్‌లో ఒక ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంమేరకు ఎస్టి ఎఫ్ఏ టీమ్ లీడర్ అంజి రెడ్డి సిబ్బంది దాడి నిర్వహించి 1.280 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
ఈ కేసులో గౌరిబాయి అనే మహిళలను అరెస్ట్ చేశారు.
మహిమ దేవి అనే మహిళలపై కూడ నమోదు అయినట్లు అంజి రెడ్డి తెలిపారు.
కుత్బుల్లాపూర్‌లో..1.090 గంజాయి పట్టివేత..
కుత్భుల్లాపూర్ పాషా గ్రౌండ్ ప్రాంతంలో కుత్భుల్లాపూర్ స్టేషన్ సిబ్బంది గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు దాడి నిర్వహించి 1.090 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
బీదర్‌కు నిందితుడు మజహర్ ఉద్దిన అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆతడి వద్ద ఉన్న బైక్‌ను, సెల్ ఫొన్‌ను స్వాధీనం చేసుకున్నారు.