షీ టీమ్స్ ప్రత్యేక వాహనాలు ప్రారంభించిన సీపీ మహంతి
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ డా. గజరావ్ భూపాల్ షీ టీమ్స్ వాహనాలను ప్రారంభించారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL) SCSC సహకారంతో CSR కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ షీ టీమ్స్ కి 12 వాహనాలు అందించారు. వీటిని కమిషనర్ మహంతి గచ్చిబౌలి కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. మహిళల భద్రత కోసం ఏర్పాటైన షీ టీమ్స్ పనితీరు చాలా బాగుందని, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాహనాలు అందించడం వల్ల ఇంకా మెరుగైన సేవలు అందించడంలో ముందుండవచ్చని సీపీ అన్నారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) ద్వారా ఈ ద్విచక్ర వాహనాలను సైబరాబాద్ పోలీసులకు అందించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ డీసీపీ సాయి శ్రీ, మహిళ & బాల సురక్షిత విభాగం డీసీపీ సృజన కర్ణం, CAR హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, SCSC సీఈఓ నవేద్ ఖాన్, CAR హెడ్‌క్వార్టర్స్ ADCP షమీర్, మహిళ & బాల విభాగం ACP ప్రసన్న కుమార్, SHE Teams ఇన్స్పెక్టర్లు రమణ రెడ్డి మరియు ప్రతాప్ లింగం, BGL మేనేజింగ్ డైరెక్టర్ రామ్ మోహన్ రావు కర్నాటి, డైరెక్టర్ ఆఫ్ కమర్షియల్ యేలేశ్వరపు దనూతా, GM కమర్షియల్ & మార్కెటింగ్ రోహిత్ గార్గ్, GM CGD ఓమేశ్వర్ కప్పాల, OIC హైదరాబాద్ ఏ. రామకృష్ణ, మేనేజర్ HR సంగ్రాం పటీ, మేనేజర్ ప్రాజెక్ట్స్ & O&M సూరజ్ యెడ్లా, డిప్యూటీ మేనేజర్ అడ్మిన్ & సెక్యూరిటీ సాయి ప్రసాద్, MTO RIs ప్రశాంత్ మరియు వీరలింగం, ట్రాఫిక్ అడ్మిన్ BNS రెడ్డి, SCSC సభ్యులు మరియు ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.