రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు..దళారులకు చెక్

On
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు..దళారులకు చెక్

ఏకకాలంలో ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు

తిరుమలగిరిలో ఇద్దరు క్లర్కులు, 10 మంది ఏజెంట్లు అదుపులోకి..
ఉప్పల్ లో కార్యాలయ గేట్లు మూసేసి తనిఖీలు.. 

By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
ఆర్టిఏలో దళారుల దందాపై ఏసీబీ దండెత్తింది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో Screenshot_20250626_201118_Gallery నిర్వహించిన సోదాలు హడలెత్తించింది.ఏసీబీ దాడుల భయంతో పలు చోట్ల పౌర సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలాకాలం పాటు ఎలాంటి తనిఖీలు, సోదాలు లేకుండా నిరాటంకంగా సాగుతున్న దళారుల కార్యకలాపాలకు ఏసీబీ దాడులతో నెమ్మదించాయి. 
గ్రేటర్ లో అలజడి..
గ్రేటర్ లోని ఉప్పల్, తిరుమలగిరి రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో ఏసీబీ తనీఖీలు నిర్వహించింది. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్సీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించిన దాడులు అలజడి సృష్టించాయి. ఏసీబీ అధికారులు దళారులను అదుపులోకి తీసుకుని పలు పత్రాలను పరిశీలించారు.ఉప్పల్ ఆర్టీఏ ఆఫీసులో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.. గేట్లు మూసివేసి అందరిని బయటకు పంపించివేశారు. తిరుమలగిరిలోని ఇద్దరు క్లర్కులతోపాటు 10 మంది ఏజెంట్లను పట్టుకున్నారు.ఉప్పల్ లో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్స్ ద్వారా జరుగుతున్న పలు అక్రమాలపై ఏసీబీ అరా తీస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న ఆర్టీఏ అధికారుల ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన తీరుపై విచారణ జరుపుతోంది.
ఏజెంట్లపై ‘ఏఐ’ అస్త్రం..
ఏజెంట్లు, దళారులపై రవాణా శాఖ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలిసింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో ఆయా కార్యాలయాల వద్ద నిఘా పెట్టింది. ఈ నిఘా కెమెరాలు క్లిక్ మనిపించే ప్రతి వ్యక్తికి ఒక కోడ్ నమోదవుతోంది. ఆ కోడ్ ఆధారంగా సదరు వ్యక్తి ఒకరోజులో ఎన్ని సార్లు ఆర్టీఏ కార్యలయానికి వస్తున్నాడు.. ఏ పని కోసం ఎవరిని కలుస్తున్నాడనేది ఇట్టే తెలిసిపోతుంది.ఖైరతాబాద్  ఈర్టీఏ కార్యాలయంలో ప్రయోగత్మకంగా  ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలు సత్పలిచ్చాయి. వారం రోజుల్లోనే 45 మంది  దళారులు పదేపదే ఆఫీసుకు వచ్చినట్లు పసిగట్టాయి. దీంతో తిరుమలగిరి, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయాల వద్ద కూడా ఏఐ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏఐ కెమెరాల ద్వారానే ఏజెంట్లు, క్లర్కులను ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 
ఏజెంట్లదే హావా..
ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని కావాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే. అంతేగాకుండా ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వెళ్తే పని కాకపోగా రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వాహనదారులు ఏజెంట్లు అడిగిందల్లా ఇచ్చుకుని తమ పనులు చక్కబెట్టుకుంటారు. ఆయా పనుల నిమిత్తం సదరు ఏజెంట్లు ఆర్టీఏ అధికారులు, సంబంధిత సెక్షన్ సిబ్బందికి ముడుపులు చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ లోని ఉప్పల్, తిరుమలగిరి, మేడ్చల్, కూకట్ పల్లి ,మోహిదీ పట్నం, బండ్లగూడ, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, మణికొండ,మలక్ పేట తదితర రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో ఏజెంట్ల అక్రమ దందాలు ఆగడంలేదు. నకిలీ లైసెన్స్ లు, ఇన్స్ రెన్స్ లు తయారు చేసి వాహనదారులను మోసగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఇలాంటి మోసాలకు పాల్పడ్డ ఏజెంట్లు కటకటాలపాలయ్యారు. కొందరు డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహకులు సైతం ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఏజెంట్లను అరికట్టేందుకు ఇప్పటి వరకు 17 రకాల సేవలను ఆన్ లైన్ లోకి మార్చారు. కానీ తరచూ సాంకేతిక సమస్యలు సృష్టిస్తూ.. ఏజెంట్ల ను అశ్రయించేలా చేస్తున్నారు. దీంతో పౌర సేవలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే రెండు రెట్లు అధికంగా ఏజెంట్లకు సమర్పించుకోవాల్సి వస్తోంది. అయితే గురువారం ఏసీబీ అధికారులు ఏజెంట్లనే టార్గెట్ చేస్తూ.. దాడులు నిర్వహించడంతో అవినీతి అదికారుల్లో వణుకు మొదలైంది.ఇప్పటికైనా ఏజెంట్ల దందాకు చెక్ పడునుందా..? లేదా ? అనేది వేచిచూడాల్సిందే..

Advertisement

Latest News