మాసబ్ చెరువు కింద నాలాను ఒక నమూనాగా తీర్చిదిద్దుతాం --- హైడ్రా కమిషనర్ 

On
మాసబ్ చెరువు కింద నాలాను ఒక నమూనాగా తీర్చిదిద్దుతాం --- హైడ్రా కమిషనర్ 

  • 7.50 కిలోమీటర్ల మేర నాలా విస్తరణ
  • మాసబ్ చెరువు దిగువ ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

IMG-20250709-WA0189హైదరాబాద్:  మాసబ్ చెరువు - దిలావర్ఖాన్ - పెద్దఅంబర్పేట చెరువులను అనుసంధానం చేసే నాfలాను ఒక మోడల్ గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ చెప్పారు. మొత్తం 7.50 కిలోమీటర్ల విస్తరించి ఉన్న ఈ నాలా పొడుగున చాలా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో.. ఇప్పుడు తగిన వెడల్పుతో నాలాను నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని అన్నారు.  రెవెన్యూ, GHMC, ఇరిగేషన్ యిలా సంబంధిత శాఖలన్నిటితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. మాసబ్ చెరువు - దిలావర్ఖాన్ చెరువుల మధ్య నాలా సరిగా లేక అనేక కాలనీలు నీట మునుగుతున్నాయనే పిర్యాదుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎంఎల్ఏ శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారితో కలసి  పలు ప్రాంతాలను బుధవారం కమిషనర్ పరిశీలించారు.  మాసబ్ చెరువు - దిలావర్ఖాన్ చెరువుల మధ్య జాలికుంట పరిసరాల్లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కమిషనర్ చూసారు. జాలికుంటలో కట్టడం వల్ల సెల్లార్లోకి నీళ్లు చేరడంతో ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించారు. 
పూర్తిస్థాయిలో నాలా అభివృద్ధి...
చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న వరద కాలువలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ఇంకా పెద్దమొత్తంలో యిళ్ళ నిర్మాణాలు జరగలేదు కనుక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాలాను నిర్మించాల్సి ఉంటుందని సూచించారు.  అలాగే చెరువుల ఆక్రమణ జరగకుండా చూడాలని అన్నారు. చెరువులలో మట్టిపోసి నింపినవారిపై  చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెరువుల, నాలాలను మనం కాపాడుకుంటే వరదలకు ఆస్కారం ఉండదని హితవు పలికారు. మాసబ్ చెరువులో మట్టి పోసినవారిపై చర్యలుంటాయని అన్నారు. అనంతరం కర్మాంఘాట్, బడంగిగిపేట ఏరియాల్లో నాలా విస్తరణకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. కర్మాంఘాట్ ప్రాంతంలోని ఉదయ్నగర్ కాలనీలో నాలా విస్తరణ వెంటనే చేపట్టాలని సూచించారు. అలాగే రావిర్యాల చెరువును పరిశీలించారు. చెరువు పైభాగంలో నివాసాలు నీట మునుగుతున్న నేపథ్యంలో చెరువు అలుగులను పరిశీలించారు.

Advertisement

Latest News