Cricket: టెస్టుల్లో 27రన్స్ కే ఆలౌట్.. ఛాంపియన్ జట్టు చెత్త రికార్డ్..

By PC RAO
On
Cricket: టెస్టుల్లో 27రన్స్ కే ఆలౌట్.. ఛాంపియన్ జట్టు చెత్త రికార్డ్..

టెస్ట్ క్రికెట్ లో వెస్టిండీస్ చెత్త రికార్డు

ఆస్ట్రేలియాపై 27 పరుగులకే ఆలౌట్ అయిన విండీస్

9 పరుగులకే 6 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్

టెస్ట్ క్రికెట్ అంటే సుదీర్ఘ ఫార్మాట్.. రోజుల తరబడి బ్యాటింగ్.. పదులకొద్దీ ఓవర్లు.. వందల కొద్దీ బంతులు విసిరినా వికెట్లు రాక బౌలర్లకు విసుగుతెప్పించే ఫార్మాట్. టెస్టుల్లో హాఫ్ సెంచరీలు, సెంచరీలు చాలా ఈజీ.. క్రీజ్ లో నిలదొక్కుకుంటే చాలు పరుగులు వచ్చేస్తాయి. అందుకే టెస్టుల్లో డబుల్, ట్రిపుల్ సెంచరీలు.. 500, 600 పరుగుల రికార్డులను మనం చూస్తుంటాం. 11 నంబర్లో వచ్చిన వాళ్లు కూడా సెంచరీలు చేసిన రికార్డులు టెస్టుల్లో ఉన్నాయి. కానీ జట్టంతా కలిసి 27 పరుగులకే చాప చుట్టేయడం ఎక్కడైనా చూశామా..? టీ20ల్లోనే ఈజీగా 200 కొట్టేస్తున్న రోజులివి. అలాంటికి టెస్టుల్లో 27 పరుగులకు ఆలౌట్ అయిన జట్టు ఉంటుందా అనేకదా మీడౌట్..  ఆ చెత్త రికార్డును మూటగట్టుకుంది ఏ పసికూన జట్టో కాదు. ఒకప్పటి ఛాంపియన్ వెస్టిండీస్. నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న విండీస్ జట్టు టెస్టుల్లో రెండో అత్యల్ప స్కోరు రికార్డును మూటగట్టుకుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ చివరి టెస్టులో కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. 204 పరుగుల టార్గెట్ను ఛేదించలేక చతికిలబడింది. 

కింగ్ స్టన్ లో జరిగిన మూడో టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 225 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ 143 పరుగులకే కుప్పకూలింది. 82 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్ లో బరిలో దిగిన ఆసీస్ 121 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో విండీస్ ఎదుట 204 లక్ష్యాన్నుంచింది. స్వల్ప లక్ష్యంగా బరిగిలో దిగిన విండీస్.. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి పేకమేడలా కూలింది.  సున్నాకే 3 వికెట్లు.. 11 రన్స్ కే 6 వికెట్లను కోల్పోయింది. ఓ వైపు స్టార్క్ నిప్పులు చెరిగితే మరోవైపు స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ తో సత్తా చాటాడు. దీంతో 27 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది. దీంతో 176 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. జస్టిన్ గ్రీవ్స్ ఒక్కడే డబులి డిజిట్ స్కోర్ చేసి 11 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో సెకండ్ హయ్యెస్ట్ స్కోర్ 6 ఎక్స్ ట్రాలు. 

టీ20 లీగ్స్ మోజులో పడి విండీస్ స్టార్ ప్లేయర్లంతా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం, క్రికెట్ బోర్డులో రాజకీయాలు, ఆటగాళ్ల ఫీజుల చెల్లింపులో నిర్లక్ష్యం వంటివి వెస్టిండీస్ క్రికెట్ ను దారుణంగా దెబ్బతీశాయి. 

Advertisement

Latest News

నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!  నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లుజనసేనకు 9, బీజేపీకి 4  చైర్మన్ల పదవులుబీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 566 మార్కెట్ కమిటీ చైర్మన్లలో...
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?
కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం
రాయుడు హత్య కేసులో రూ.30లక్షల ఆఫర్.. పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాయుడి చెల్లెలు ప్రశ్నలు
అడవిని మింగేస్తున్న బొగ్గు బట్టీలు..! తగ్గిపోతున్న వృక్ష సంపద
బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!