విడిపోతున్న మరో సెలబ్రెటీ కపుల్.. సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన

By PC RAO
On
విడిపోతున్న మరో సెలబ్రెటీ కపుల్.. సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన

బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన

పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్లు ఇన్ స్టా పోస్ట్

2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సైనా-కశ్యప్

భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడాకులు (Saina Nehwal-Parupalli Kashyap) తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా నెహ్వాల్ ఇన్ స్టాగ్రామ్ (Instagram) పోస్ట్ ద్వారా వెల్లడించింది. తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపిన సైనా.. తమ గోప్యతను గౌరవించాలని కోరింది. ఇకపై కశ్యప్ తాను స్నేహితులుగా మాత్రమే కొనసాగుతామని స్పష్టం చేసింది. 

2018లో సైనా, కశ్యప్‌ల వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఇద్దరూ బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పటి నుంచి స్నేహితులయ్యారు.ఆ స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. సైనా ఒలింపిక్స్, వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ వంటి మెగా ఈవెంట్స్ లో సత్తా చాటి స్టార్ డమ్ తెచ్చుకుంది. కశ్యప్ వ్యక్తిగతంగా రాణించినా అనుకున్నంత ఫేమ్ మాత్రం రాలేదనే చెప్పాలి. 

పెళ్లి తర్వాత సైనా ఆట తీరు పూర్తిగా మారిపోయింది. గాయలబారిన పడటంతో తరచూ టోర్నీలకు దూరమతూ వచ్చింది. రెండేళ్ల క్రితం చివరిసారిగా ప్రొఫెషనల్ టోర్నీల్లో ఆడింది. తాను ఆర్థరైటిస్ తో బాధపడుతున్నట్లు వెల్లడించిన సైనా.. కెరీర్ ముగింపుపై త్వరలోనే నిర్ణయం చెబుతానని గతంలోనే చెప్పింది. మరోవైపు బ్యాడ్మింటన్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కశ్యప్.. ప్రస్తుతం కోచింగ్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. 

Advertisement

Latest News