వడ్డీ రేట్లపై RBI కీలక ప్రకటన 

By Ravi
On
వడ్డీ రేట్లపై RBI కీలక ప్రకటన 

వడ్డీ రేట్లపై RBI కీలక ప్రకటన 
----------------------
విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సమావేశంలోని వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. గడిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి రెపో రేటును తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి దిగివచ్చింది.
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన క్రమంలో ప్రస్తుతం ఉన్న రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతనికి దిగొచ్చింది. అలాగే రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మే ,2023 నుంచి కీలక పాలసీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. అలాగే ఐదేళ్ల తర్వాత రెపో రేటు తగ్గించింది. కీలక పాలసీ రేటు తగ్గడంతో వివిధ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇక భారత జీడీపీ వృద్ధి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఆర్‌బీఐ. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 6.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. క్యూ1లో 6.7 శాతం, క్యూ2లో 7 శాతం, క్యూ3, క్యూ4లో 6.5 శాంతం ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం రేటు 4.8 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది.
'బ్యాంకింగ్, పేమెంట్స్ సిస్టమ్‌లో డిజిటల్ సెక్యూరిటీని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ చర్యలు తీసుకుంటోంది. అందులో డిజిటల్ పేమెంట్ల కోసం అదనపు అథెంటికేషన్ ప్యాక్టర్ తీసుకురావడం ఒకటి. ప్రస్తుతం ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ డిజిటల్ పేమెంట్లకు అందుబాటులోకి వస్తుంది. ఇక రెండోది.. బ్యాంకుల కోసం ప్రత్యేకంగా Bank.in ఇంటర్నెట్ డొమైన్ తీసుకొస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అమలులోకి వస్తుంది. దీని ద్వారా బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. ఆ తర్వాత మొత్తం ఆర్థిక రంగం కోసం fin.in డొమైన్ తీసుకొస్తున్నాం అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
రెపో రేట్లు తగ్గడం వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీకే రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు అందుతాయి. దీంతో బ్యాంకులు కస్టమర్లకు ఆ బెనిఫిట్ అందిస్తాయి. కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. పర్సనల్ లోన్స్, గృహ రుణాలు, వహికల్ లోన్స్ వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. దీంతో నెలవారీ ఈఎంఐలు తగ్గుతాయి. ఇది మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం.. పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం..
పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తీసుకున్న సైలెంట్.. కానీ స్ట్రాంగ్ రాజకీయ స్ట్రాటజీపై లోతైన విశ్లేషణ.
మింగేసింది అంతా..కక్కించిన హైడ్రా..
కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.