వైసీపీ బాటలోనే విజయ్.. జగన్ డైలాగ్ రిపీట్ చేసిన టీవీకే చీఫ్

By Dev
On
వైసీపీ బాటలోనే విజయ్.. జగన్ డైలాగ్ రిపీట్ చేసిన టీవీకే చీఫ్

పొత్తు లేదు..కూటమి కాదు..సోలోగానే మా ఫైట్!

తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలనం

 సీఎం అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్‌

మరో ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గత ఎన్నికల తరహాలో సాటి హీరో పవన్ లా కాకుండా  తానూ వైఎస్ జగన్ లా సోలోగా  ముందుకు వెళతానంటూ హీరో విజయ్ ప్రకటించారు. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటు వాదులతో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పింది. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ..విభజించి పాలించే విధానాలు తమిళనాడులో చెల్లవని టీవీకే వ్యవస్థాపకుడు, హీరో విజయ్ ప్రకటించారు. బీజేపీతో చేతులు కలపడానికి తమ పార్టీ ఏమీ డీఎంకే, అన్నాడీఎంకే కాదన్నారు. బీజేపీ, డీఎంకేలతో తమ పార్టీకి పొత్తులు ఉండబోవని తేల్చి చెప్పిన విజయ్‌.. ఆ రెండు పార్టీలను తమకు సైద్ధాంతిక శత్రువులుగా పేర్కొన్నారు.   ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్‌ను ప్రకటిస్తూ శుక్రవారం చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానం జరిగింది. 

వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని టీవీకే పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని పేర్కొంది.ఆయన వ్యాఖ్యలు తమిళనాడు ద్విభాషా విధానంపై  ప్రత్యక్ష దాడి అని అభివర్ణించింది.  తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషల్ని రుద్దడాన్ని తమ పార్టీ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టం చేసింది.

 

Advertisement

Latest News

అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ...
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..