ఓ సినిమా క్లాస్ రూమ్ నే మార్చేసింది..! ఆ రాష్ట్రంలో ఇక బ్యాక్ బెంచీలు లేవు!

By Dev
On
ఓ సినిమా క్లాస్ రూమ్ నే మార్చేసింది..! ఆ రాష్ట్రంలో ఇక బ్యాక్ బెంచీలు లేవు!

అనగనగా ఓ సినిమా..ఆ సినిమా స్ఫూర్తితో కేరళ రాష్ట్రంలో క్లాస్ రూం స్టైల్ మారిపోయింది. కొల్లం జిల్లాలోని ఆర్.వి.వి సెకండరీ హయ్యర్ స్కూల్‌కు విద్యార్థులు వెళ్లి క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. బెంచీలన్నీ రౌండ్ గా వేసున్నాయి.  పాపినిశ్శేరిలోని స్కూల్, అదూర్‌లోని స్కూల్, తూర్పు మంగడ్‌లోని స్కూల్, పాలక్కాడ్‌లోని స్కూల్‌... ఈ స్కూళ్లన్నింటిలోనూ విద్యార్థులకు ఇదే ఆశ్చర్యం. కారణం... అక్కడ కూడా క్లాస్‌లలో బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. చుట్టూ వేసి ఉన్నాయి. గత నెల రోజులుగా కేరళలోని ఒక్కోబడి ఒక్కోబడి ఈ మార్పు చేసుకుంటూ వస్తోంది. 

2519b3ad5eabfe7bd988b8e6d513f11e

 

ఈ మార్పుకు కారణం ‘శనార్థి శ్రీకుట్టన్‌’ సినిమా

కేరళ రాష్ట్రంలో ఉన్నట్టుండి అక్కడ తరగతి గదులలో బ్యాక్ బెంచీలన్నీ రౌండ్ బెంచీలవడానికి కారణం  రిలీజైనప్పుడు ఎవరూ పట్టించుకోని ఒక సినిమా. నెల క్రితం ఓటీటీలోకి వచ్చాక అందరూ దాన్నే చూస్తున్నారు. ఆ చూసే వారిలో విద్యార్థులు, టీచర్లు, పాఠశాల కరెస్పాండెంట్‌లు, తల్లిదండ్రులు ఉన్నారు... వారందరినీ ఆ సినిమా కదిలించింది. అందుకే వారందరూ క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్‌ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. నిజమే. క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్‌ ఎందుకు? అంటూ ఆ సినిమా స్ఫూర్తితో క్లాస్ రూమ్ స్టైల్ మార్చేశారు.

 

sthanarthi-sreekuttan

సినిమా కథ...క్లుప్తంగా చెప్పాలంటే కె.ఆర్‌.నారాయణన్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్, కారెట్టు, తిరువనంతపురం. ఈ పల్లెటూరు స్కూల్లోని ఏడో తరగతి సి సెక్షన్‌లో జరిగే సినిమా కథే ‘శనార్థి శ్రీకుట్టన్‌’. శ్రీకుట్టన్‌ అనే కుర్రవాడు ఇంట్లోని పరిస్థితుల వల్ల రోజూ స్కూల్‌కి లేట్‌గా వస్తుంటాడు. తను వచ్చేసరికి ముందు బెంచీలన్నీ ఫిల్ అవడం వల్ల తప్పని పరిస్థితుల్లో బ్యాక్‌బెంచ్‌లో కూచుంటుంటాడు. వాడికి ముగ్గురు ఫ్రెండ్స్‌. వీళ్లంతా అల్లరి గ్యాంగ్‌ అని క్లాస్‌లో ఫ్రంట్‌ బెంచ్‌లో కూచునేవారి అభిప్రాయం. నిజానికి ఏ క్లాస్ రూం అయినా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ పై సహజంగా అందరికీ ఉండే అభిప్రాయం కూడా ఇదే. క్లాస్‌కు వచ్చే ఒక ఉపాధ్యాయుడైతే వీరి మీద పగపడతాడు. వీరు దేనికీ పనికి రారన్నది ఆ స్కూల్ టీచర్ల అభిప్రాయం. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. శ్రీకుట్టన్‌ స్కూల్‌ ఎలక్షన్‌లో నిలబడాలనుకుంటాడు. వీడి మీద పోటీగా ఫ్రంట్‌ బెంచ్‌లో కూచునే అంబడి అనే కుర్రవాడు నిలబడతాడు. ఎవరు గెలుస్తారు అనేది కథ. క్లాసురూముల్లో వివక్ష ఎన్ని రూపాల్లో ఉంటుంది... వివక్షకు కారణమైన నిర్మాణం ఎలా ఉంటుంది... క్లాస్‌రూమ్‌లోనే వివక్ష పాటించిన విద్యార్థి బయటకు వెళ్లాక పాటించడని గ్యారంటీ ఏమిటీ...   పైకి ఇదే కథ అనిపించినా దీనిని ముందు నుంచే మార్చాలి అని  దర్శకుడు వినేష్‌ విశ్వనాథ్‌ చెప్పదలుచుకున్నాడు...చాలా బాగా చెప్పాడు.

1996లో కేంద్రం చెప్పినా...

క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సీటింగ్‌ వారిలో వివక్షకు కారణం కాకూడదని, పిల్లల తెలివితేటలు... ఆర్థిక స్థితి... ప్రవర్తనను ఆధారంగా ముందు బెంచీలకు కొందరిని, వెనుక బెంచీలకు కొందరిని పరిమితం చేయకూడదని 1996లో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని మార్పులకై ప్రతిపాదించింది. అయితే ఆ మార్పులను ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ‘మొద్దు’లుగా భావించే పిల్లలను వెనుక కూచోబెట్టడం టీచర్లకు అలవాటైపోయింది.  వెనుక కూచుని వెనుకబడితే మళ్లీ వారిదే తప్పుగా నిలబెట్టడం కూడా ఆనవాయితీనే. విద్యార్థిగా పొందే గౌరవం వెనుక బెంచీ విద్యార్థులకు చాలామందికి ఉండదు. ఈ పరిస్థితి మారాలని ఒక వెనుకబెంచీ కుర్రాడిని హీరోగా చేసి అతనిలోని తెలివితేటలను, చురుకుదనాన్ని చూపుతూ నిరూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అందుకే అది కేరళ బడుల్లో కదలిక తెచ్చింది. ఇక దేశం మొత్తం ఇలాంటి సినిమాలో ఆలోచనలు వచ్చి మార్పు తేవాల్సి ఉంటుంది. మార్పు మంచిదైతే అందరికీ మంచే కదా?    

Advertisement

Latest News

నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!  నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లుజనసేనకు 9, బీజేపీకి 4  చైర్మన్ల పదవులుబీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 566 మార్కెట్ కమిటీ చైర్మన్లలో...
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?
కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం
రాయుడు హత్య కేసులో రూ.30లక్షల ఆఫర్.. పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాయుడి చెల్లెలు ప్రశ్నలు
అడవిని మింగేస్తున్న బొగ్గు బట్టీలు..! తగ్గిపోతున్న వృక్ష సంపద
బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!