స్పెషల్ హెల్ప్ లైన్ వారి కోసమే.. అధికారులు.. వారి నంబర్లు ఇవే

On
స్పెషల్ హెల్ప్ లైన్ వారి కోసమే.. అధికారులు.. వారి నంబర్లు ఇవే

AISelect_20250618_090115_Chromeపశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న భారతీయులను కాపాడేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఆ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది.
సిఎం ఆదేశంతో తక్షణ చర్యలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు..

ఢిల్లీలోని తెలంగాణ భవన్  కు చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్లలోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ తక్షణ సహాయానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది.

ప్రత్యేక అధికారుల నియామకం..

అంతే కాకుండా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నలుగురు కీలక అధికారులను ప్రత్యేకంగా నియమిస్తూ, వారి ఫోన్ నంబర్లను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఈ కింది నెంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించింది.

వందన, IAS - పి.ఎస్., రెసిడెంట్ కమిషనర్: +91 9871999044
జి. రక్షిత్ నాయక్ - లైజన్ ఆఫీసర్: +91 9643723157
జావేద్ హుస్సేన్ - లైజన్ ఆఫీసర్: +91 9910014749
సిహెచ్. చక్రవర్తి - పౌర సంబంధాల అధికారి: +91 9949351270
అయితే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు తెలంగాణ పౌరులు ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం లేదు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రవాస భారతీయుల పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Latest News

పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈరోజు (మంగళవారం)...
భూదాన్ భూముల్లో ప్రహరీ నిర్మాణం.. కోర్టులో దిక్కరణ పిటిషన్ దాఖలు
యాంకర్ స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి 
ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..!
ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.