కూటమి ప్రభుత్వంలో చీకటి పాలనా?

By Dev
On
కూటమి ప్రభుత్వంలో చీకటి పాలనా?

రహస్య జీవోల మతలబు ఏంటి?

గత ప్రభుత్వాన్ని విమర్శించి అదే దారి పట్టారా?

పారదర్శకతే ప్రభుత్వ పరిపాలనకు కొలమానం. ఏ నిర్ణయమైనా జీవోల రూపంలో బహిరంగం. జీవోలు విడుదల చేయడమే ఆ ప్రభుత్వం ఎంత నిబద్ధతగా పని చేస్తుందనడానికి నిదర్శనం. కానీ, గత ప్రభుత్వం ఈ జీవోల వ్యవస్థనే నిలిపివేసి పరిపాలించింది. అన్నీ రహస్యాలుగానే ఉంచి తన పంథా కొనసాగించింది.  ఆ విధానాన్ని తప్పుబడుతూ నాడు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ సహా అందరూ విమర్శించారు. కొన్ని మీడియాలు వాటిపై ప్రత్యేక కథనాలు, చర్చలు నడిపిన సందర్భాలు లేకపోలేదు. అన్ని జీవోలు వెబ్ సైట్ లో పొందుపరుస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న నాయకులంతా ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రతి విషయంలోనూ రహస్యమే పాటిస్తున్నారు.

రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తుందా అనే అనుమానాలు బలపడేలా పాలన నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సీక్రెట్ జీవోలు ఇస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించడానికి బీఎన్ఎస్ 111 వంటి సెక్షన్లతో నల్ల చట్టాలను తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, వేధింపుల కోసం హోంశాఖలో 44 రహస్య జీవోలు జారీ చేశారని విరుచుకుపడుతున్నారు. భూకబ్జాలు, సంతర్పణల కోసం రెవెన్యూ శాఖలో సైతం అత్యధికంగా 93 జీవోలిచ్చారని ఓ లిస్ట్ ను సైతం సోషల్ మీడియాలో విడుదల చేశారు. మున్సిపల్ శాఖలో 18, పంచాయతీ రాజ్ శాఖలో 12, జలవనరుల శాఖలో 7, ఆర్థిక శాఖలో 6, సాధారణ పరిపాలన శాఖలో 6, ఆర్ అండ్ బీలో 5, పరిశ్రమల శాఖలో 4, వ్యవసాయ శాఖలో 3, మైనార్టీ సంక్షేమ, న్యాయ, పర్యాటక శాఖల్లో ఒక్కో రహస్య జీవో జారీచేశారు. వీటిని ఆధారంగా చేసుకుని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌.. అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడె కట్టేశారని వైసీపీ ఆరోపిస్తోంది.

ఆ రహస్య జీవోలన్నీ అక్రమ కేసులు, కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పేవి, కన్సల్టెన్సీలకు బిల్లులు చెల్లించేవే అని వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని, పవన్‌ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారని మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు 2014 హయాంలో 1132 రహస్య జీవోలను విడుదల చేసిందని ఇపుడు ఆయన 4.0 ఏంటో సీక్రెట్ జీవోలలో చూపుతున్నారన్న విపక్షాల మాటలకు కూటమి ప్రభుత్వం ఏమని బదులిస్తుందో..ప్రజలకేమని చెబుతుందో చూడాలి.

Advertisement

Latest News

మళ్లీ తెరపైకి ఫాతిమా ఒవైసీ కాలేజ్ వివాదం మళ్లీ తెరపైకి ఫాతిమా ఒవైసీ కాలేజ్ వివాదం
ఎఫ్టిఎల్ లో నిర్మాణం అంటూ తేల్చి చెప్పిన హైడ్రాఅప్పుడు హడావిడి.. ఇప్పుడు మౌనం ఎందుకంటూ ప్రశ్నదమ్ముంటే కూల్చమంటూ డిమాండ్ చేసిన బిజేపి అధ్యక్షుడులోపాయికారి ఒప్పందం అంటూ ప్రచారం. ...
మహిళలంటే వైసీపీ నేతలకు ఎందుకంత ద్వేషం?
ముచ్చుమర్రి బాలిక అదృశ్యమై..ఏడాది పూర్తి..! కేసులో పురోగతి ఏది? బాధితులకు న్యాయమెప్పుడు?
హైదరాబాద్ లో టెన్షన్.. టెన్షన్.. పలుచోట్ల బాంబు బెదిరింపు..
బతుకమ్మకుంటకు మళ్లీ జీవం పోసిన హైడ్రా..
అమెరికాలో మూడవ పార్టీకి స్థానం ఉందా?
అమెరికాలో రోడ్డుప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవదహనం