పలు చోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
ఎక్సైజ్ పోలీసులు చేస్తున్న స్పెషల్ డ్రైవ్ సత్పలితాలు ఇస్తున్నాయి. నగరంలో పలు చోట్ల దాడులు చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ వెంకటగిరి కాలనీ లో ఎస్ టి ఎఫ్ బి టీం ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి 2.109 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాకి చెందిన శివ సాయి అరకు నుంచి గంజాయి తీసుకొని వచ్చి ప్రవీణ్, గణేష్, కళ్యాన్ తో అమ్మకాలు జరిపిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని వీరివద్ద ఉన్న బైకు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు నిందితులను గంజాయిని జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
మరో కేసులో.. కొత్త మందుల కౌశిక్ చంద్రశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఎస్టిఎఫ్ సిటీ వెంకటేశ్వర్లు సిబ్బంది పట్టుకున్నారు. జడ్చర్ల సమీపంలో నిందితుల నుంచి 1.3 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్నారు ఇద్దరిని, గంజాయిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.