శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల

On
శ్రీకాళహస్తిలో  భారతీయ జనతా పార్టీ  జిల్లా కార్యశాల

భారతీయ జనతా  కేంద్ర రాష్ట్ర  పార్టీ సూచనల మేరకు  తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ  కార్య శాల జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కోలా ఆనంద్ ముని సుబ్రహ్మణ్యం  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ  నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా  11 సంవత్సరాలుగా సేవ, సుపరి పాలన, అభివృద్ధి వికసిత భారత లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా  పర్యావరణ పరిరక్షణ దినంగా జిల్లా స్థాయిలో  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని,  అంతర్జాతీయ యోగా దినోత్సవను విజయవంతం చేయాలని , డాక్టర్ శ్యామ ప్రసాద్  మొఖర్జీ వర్ధంతి సందర్భంగా  బలిదాన్ దివాస్ వీధి వీధి నందు నివాళులర్పించాలని తెలియజేశారు, అదే విధంగా  ఎమర్జెన్సీ  50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా  నాటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన దేశ ప్రజల యొక్క అణచివేత ధోరణి,, మాట్లాడిన వారిని అన్యాయంగా జైలుకు పంపించడం  ఈనాటి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకార్య వర్గ సభ్యులు  ఎస్ ఎస్ ఆర్ నాయుడు , కండ్రిక ఉమా,పనబాక కోటేశ్వర రావు,  జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప, జిల్లా పదాధికారులు ,  వివిధ మండల అధ్యక్షులు , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు
తెలంగాణ ప్రాంతంలో రాఖీ విక్రయాలు ఊపందుకున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగతో ఎక్కడ చూసినా షాపులన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. వివిధ రంగులతో షాపులన్ని...
రుద్రారంలో తోషిబా అధునాతన తయారీ కేంద్రం ప్రారంభం
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యా ప్రేరణ
ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..
ఇక అదిరిపోనున్న హైదరాబాద్..
సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం
ఇక తాగే వాళ్లకు.. తాగినంత బీర్లు..