పెండింగ్ లో ఉన్న యుఐ కేసులను వెంటనే పరిష్కరించాలి. సీపీ సుధీర్ బాబు..

By Ravi
On
పెండింగ్ లో ఉన్న యుఐ కేసులను వెంటనే పరిష్కరించాలి. సీపీ సుధీర్ బాబు..

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు  తమ కమిషనరేట్ లో నేరేడ్మెట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, మహేశ్వరం, యాదాద్రి భోనగిరి జోన్ ల డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఎసిపిలు, సీఐలతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలు, నేర దర్యాప్తులకు సంబంధించిన కీలక అంశాలపై పనితీరు మరియు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న మొత్తం UI కేసులను త్వరితగతిన పరిష్కరించడం, నేర నివారణ వ్యూహాలపై సమగ్రమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్యాప్తు సమగ్రవంతంగా జరిగే విధంగా, నేరస్తులకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయాలని సూచించారు. పోలీస్టేషన్లలో ఉన్న వర్టికల్స్ పనితీరు సక్రమంగా ఉండాలని వాటిని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులకు తెలిపారు.  బ్లూకోల్ట్స్, డయల్ 100 మీద ప్రతిరోజు రివ్యూ చేసుకోవాలన్నారు. కేసులు మరియు కౌంటర్ కేసులలో అసలు నిందితులను ఎలా గుర్తించాలి? అట్టి కేసుల విచారణను ఎలా చేపట్టాలి మరియు బాధితులకు ఎలా న్యాయం చేయాలి అనే విషయాలను చాలా నిర్మాణాత్మకంగా వివరించారు. రాబోయే బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని పెట్రోలింగ్, చెక్- పోస్టుల వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి పివి పద్మజ, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, భువనగిరి డిసిపి అక్షన్డ్ యాదవ, డీసీపీ మహేశ్వరం సునీతా రెడ్డి, డిసిపి ఎస్బీ జి నర్సింహారెడ్డి, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, డీసీపీ అడ్మిన్ ఇందిరా, అడిషనల్ డీసీపీ లు, ఎసిపిలు తదితరులు పాల్గొన్నారు.20250528_185004

Advertisement

Latest News

అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ...
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..