రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
By Ravi
On

రంగా రెడ్డి జిల్లా.రాజేంద్ర నగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ ఇంద్రగాంధీ సొసైటీలో రోడ్డు ఆక్రమించి నిర్మించిన భారీ ప్రహరి గోడను హైడ్రా కూల్చివేసింది. కొందరు వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా ఇందిరాగాంధీ సొసైటీలో గోడను నిర్మించారు. దీనిపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయగా భారీ పోలీసు బందోబస్తు మధ్య గోడను కూల్చివేసి ప్రజలకు రహదారిని కల్పించారు. అధికారులు గోడను కూల్చే సమయంలో ఇది మా స్థలమంటూ కొందరు హైడ్రాధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలంలోనే ఉన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News

10 Aug 2025 18:00:13
పార్కింగ్ కష్టాలు తీర్చే దిశగా అడుగులు..ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ సిద్ధం..నాంపల్లిలో 1st పేజ్ సిద్ధం చేసిన అధికారులు..