జీడిమెట్లలో ఘరానా దొంగ అరెస్ట్ – రూ.11.5 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
By Ravi
On
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ గృహ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. విలేఖరుల సమావేశంలో జీడిమెట్ల సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు వేణు కుమార్‌ను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి రూ.11.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సంపత్ సాయు పరారీలో ఉన్నాడు.
నిందితుడు వేణు కుమార్ ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 44 గృహ చోరీల కేసుల్లో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. పాక్సో చట్టం మరియు NDPS చట్టం కేసుల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి. గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
Related Posts
Latest News
మింగేసింది అంతా..కక్కించిన హైడ్రా..
11 Oct 2025 07:09:40
*ఆక్రమణలను తొలగించిన హైడ్రా*దాదాపు 12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం*దాదాపు రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

.jpeg)