Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు రానివారికి గుడ్ న్యూస్.. రెండో విడతకు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. వివరాలు ఇవే..!

By PC RAO
On
Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు రానివారికి గుడ్ న్యూస్.. రెండో విడతకు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. వివరాలు ఇవే..!

తల్లికి వందనం రెండో విడతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

నగదు జమకాని వారికి త్వరలోనే జమ

తేదీ ఖరారు చేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. ఐతే ఈ స్కీమ్ కింద కొందరికే డబ్బులు జమయ్యాయి. మరికొంతమందికి ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు ఇంకా పొందని వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ కేటగిరీలోని వారి ఎకౌంట్లలో నగదు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తల్లికి వందనం నగదు జమకాని వారు మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో పూర్తిగా అనర్హులు, అర్హులైనా వివిధ సాంకేతిక కారణాలతో డబ్బులు జమకాని వారు, కొత్తగా 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తమ పిల్లలను చేర్చిన తల్లులు ఉన్నారు. తొలి కేటగిరీలోని వారికి తల్లికి వందనం వర్తించదు. మగిలిన రెండు కేటగిరీల్లోని వారికి డబ్బులు జమ చేసే తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. 


1వ తరగతిలో కొత్తగా విద్యార్థులను చేర్పించిన తల్లులు, ఇంటర్ ఫస్టియర్‌లో చేర్పించిన తల్లులతో పాటు తమ పిల్లలను స్కూల్ మార్పించుకున్న తల్లులకు సంబంధించిన తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.13,000 చొప్పున  ఈనెల 10వ తేదీన అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో దాదాపు 70శాతానికి పైగా లబ్ధిదారులకు అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. ఆ తర్వాత నగదు జమ కానివారికి ప్రత్యేక గ్రివెన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రక్రియ పూర్తైతే ఈనెల3వ తేదీనే నగదు జమ చేయాలని ప్రభుత్వం భావించింది. ఐతే చాలా మంది తల్లులు తాము కొత్తగా పిల్లల్ని బడిలో చేర్చామని సచివాలయాల్లో చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరూ పథకాన్ని కోల్పోవద్దనే ఉద్దేశంతో గడువును పెంచింది. దీంతో ఈ ప్రక్రియంతా వీలైనంత త్వరగా పూర్తి చేసి 10న లబ్ధిదారులకు నగదు జమ చేయాలని నిర్ణయించింది. 


ఈసారి ఎలాంటి ఆలస్యం, ఇబ్బందులు లేకుండా ఒకే విడతలో మిగిలిన వారందరికీ నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 10 తర్వాత కూడా ఎకౌంట్లలో నగదు జమ కాకుంటే వారు పూర్తిగా అనర్హుల జాబితాలో చేరిపోయినట్లే. ఇప్పటికే పథకానికి అర్హులై నగదు జమ కాకపోతే వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లి లబ్ధిదారుల జాబితాని చెక్ చేసుకోవాలని.. అందులో పేరు లేకపోతే వెల్ ఫేర్ అసిస్టెంట్ సాయంతో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. 


తల్లికి వందనం తొలి విడతలో.. 67 లక్షల 27 వేల మంది విద్యార్థులు లబ్ది పొందారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లబ్ధి పొందిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఐతే ఎటొచ్చి కొత్తగా పిల్లల్ని స్కూళ్లలో చేర్పిస్తున్న వారికే టెన్షన్ ఉంటుంది. ఇప్పటికీ అడ్మిషన్లు జరుగుతుండటం.. పిల్లల వివరాలు నమోదు ఆలస్యమవుతుండటం మరికొందరిని టెన్షన్ పెడుతోంది. 

జులై 10న ప్రభుత్వం.. పేరెంట్స్-టీచర్స్ మెగా ఈవెంట్‌ని జరపబోతోంది. అందుకే అదే రోజున ఎట్టిపరిస్థితుల్లో రెండో విడతగ నగదును జమ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా జరగని పక్షంలో తల్లిదండ్రుల సమావేశాల్లోనే ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం కూడా ఈసారి పక్కాగా వివరాలు సేకరించి డబ్బులు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. రెండో విడత తర్వాత తల్లికి వందనం పథకంపై సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి.

Advertisement

Latest News

బీజేపీ అధ్యక్ష రేసు - ముగ్గురిలో ఒకరికి ఛాన్స్..! బీజేపీ అధ్యక్ష రేసు - ముగ్గురిలో ఒకరికి ఛాన్స్..!
* త్వరలో బీజేపీ అధ్యక్ష ఎన్నిక* ఈసారి మహిళకు అవకాశం ఇచ్చే యోచన* రేసులో నిర్మలా, పురంధరేశ్వరి, వనతి శ్రీనివాస్
వైసీపీ బాటలోనే విజయ్.. జగన్ డైలాగ్ రిపీట్ చేసిన టీవీకే చీఫ్
ఏపీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా?
మరోసారి చిక్కుల్లో అల్లు ఫ్యామిలీ..
మత్తుకి బానిసై యువత జీవితం నాశనం చేసుకోవద్దు.. డీజీపీ జితేందర్
ఒకే ఫ్రేమ్‌లో పవన్ ఇద్దరు కుమారులు.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న ఫోటో
Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు రానివారికి గుడ్ న్యూస్.. రెండో విడతకు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. వివరాలు ఇవే..!