మరోసారి చిక్కుల్లో అల్లు ఫ్యామిలీ..

On
మరోసారి చిక్కుల్లో అల్లు ఫ్యామిలీ..

  • రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ
  • ఏడు గంటలపైగా అరవింద్ ని విచారించిన అధికారులు
  • 101.48కోట్లు రుణం తీసుకొని చెల్లించలేదని అభియోగం
  • మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశం..

By. V. Krishna kumar

Tpn: స్పెషల్ డెస్క్..

enforcement-directorateఅల్లు ఫ్యామిలీ మరోసారి చిక్కుల్లో పడింది. రీసెంట్ గానే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ విషయంలో అల్లు అరవింద్ (Allu aravind) పేరు తెరపైకి రావడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement dairectorate) (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. సుమారు మూడు గంటల అధికారులు ఆయనను విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్ను అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 101.48 కోట్ల రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించక పోవడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈసీఐఆర్ ఫైల్ చేసి విచారణ ప్రారంభించింది. 2024లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్లలో సోదాలు నిర్వహించిన ఈడీ దాదాపు రూ. కోటి 45 లక్షల మేర నగదు సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేశారని, ఆర్బీఐ గైడ్లైన్స్ను ఉల్లంఘించి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించి అల్లు అరవింద్ పేరు ఆ సంస్థ లావాదేవీల్లో ప్రస్తావించబడటంతో ఈడీ విచారణకు పిలిపించింది. వాస్తవంగా ఆయనకు ఆ సంస్థతో ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, గీత ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించారు. ఈ బ్యానర్ పై అనేక అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ, ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా రాణిస్తున్నారు. ఆయన ముగ్గురు కుమారుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా రాణిస్తుండగా.. అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు.

 

Advertisement

Latest News