ఒకే ఫ్రేమ్‌లో పవన్ ఇద్దరు కుమారులు.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న ఫోటో
By PC RAO
On
తన ఇద్దరు కుమారులతో పవన్ కల్యాణ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమారులతో కలిసి నడిచే ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఉదయం హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి వస్తున్నప్పుడు తీసిన ఈ ఫోటోలో పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమారులైన అకీరా నందన్, మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి నడుస్తున్నారు. ఫోటోలో చిన్న కుమారుడైన మార్క్ శంకర్ చేయి పట్టుకుని సాధారణంగా నడుస్తుండగా, ఆయన పెద్ద కొడుకు అకీరా మాత్రం తండ్రికి కాస్త వెనుకగా పక్కనే నడుస్తున్నాడు. ఎయిర్ పోర్టులో ఈ ఫోటో క్లిక్ అనిపించగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీన్ని తెగ షేర్లు చేస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ చేస్తూ సంబరపడిపోతున్నారు.
Related Posts
Latest News
04 Jul 2025 21:16:26
* త్వరలో బీజేపీ అధ్యక్ష ఎన్నిక* ఈసారి మహిళకు అవకాశం ఇచ్చే యోచన* రేసులో నిర్మలా, పురంధరేశ్వరి, వనతి శ్రీనివాస్