సూళ్లూరుపేటలో కూటమి ప్రభుత్వానికి సంవత్సరం – టీడీపీ కార్యకర్తల ఘనంగా సంబరాలు

On
సూళ్లూరుపేటలో కూటమి ప్రభుత్వానికి సంవత్సరం – టీడీపీ కార్యకర్తల ఘనంగా సంబరాలు

సూళ్లూరుపేట, జూన్ 13:
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ కేక్ కట్ చేసి, "జయహో కూటమి" నినాదాలతో కార్యకర్తలతో కలిసి జెండాలు ఊపుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనస్సులను గెలుచుకున్నాయి. పరిపాలనలో పారదర్శకతకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది” అని అన్నారు.

వైద్య, విద్య, సాగు రంగాల్లో కూతవేటు మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రజలకు అనుకూలంగా పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే విజయశ్రీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టి. సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, ఏ.జి. కిషోర్, చిట్టేటి పెరుమాళ్, శ్రీనివాసులు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. "ఒకతైకతో పనిచేస్తేనే విజయాలు సాధ్యమవుతాయి" అని వారు పేర్కొన్నారు.

Advertisement

Latest News