చంద్రగిరి అభివృద్ధికి నిదర్శనం రామచంద్రాపురం: ఎమ్మెల్యే పులివర్తి నాని

On
చంద్రగిరి అభివృద్ధికి నిదర్శనం రామచంద్రాపురం: ఎమ్మెల్యే పులివర్తి నాని

చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి గ్రామానికీ అభివృద్ధి తేవడం తామే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.

రామచంద్రాపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే నాని గారు ప్రారంభించారు. మండలానికి చేరుకున్న ఆయనకు అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గారు, అనంతరం సి.రామాపురం పంచాయతీ కోదండరామాపురంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి సీసీ రోడ్డును ప్రారంభించారు.

"విజన్ 2047"లో భాగంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రతి గ్రామానూ రోడ్డులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలతో సమృద్ధిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వానికి సంకల్పం ఉందన్నారు.

Advertisement

Latest News

పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈరోజు (మంగళవారం)...
భూదాన్ భూముల్లో ప్రహరీ నిర్మాణం.. కోర్టులో దిక్కరణ పిటిషన్ దాఖలు
యాంకర్ స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి 
ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..!
ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.