ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి

On
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి

ఆంధ్రప్రదేశ్

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో బెంగళూరుకు చెందిన ఆంటోనీ అనే ప్రైవేట్ ఉద్యోగి, Growbet777 అనే నకిలీ బెట్టింగ్ యాప్ చేతిలో రూ.7.5 లక్షలు మోసపోయాడు. www.grow-bet777.com అనే వెబ్‌సైట్ ద్వారా ఈ యాప్ సేవలు అందిస్తుండగా, దీని వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా ఉందని అనుమానిస్తున్నారు.

సోషల్ మీడియాలో డబ్బు రెట్టింపు అవుతుందని ప్రకటన చూసిన ఆంటోనీ, ప్రారంభంగా ₹10,000 UPI ద్వారా చెల్లించాడు. యాప్‌లో బ్యాలెన్స్ పెరుగుతున్నట్లు కనిపించడంతో, అతను మరో ₹50,000, ₹1 లక్ష చొప్పున మొత్తంగా ₹7.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

ప్రతిసారి కొత్త UPI IDలు (bkalmar0519@axl, chsri4625@axl, devanshyaaqua.ibz@icici) పంపుతూ, ఆయా ఖాతాలపై పేర్లు CH శ్రీధర్, మమిడిశెట్టి సత్యనారాయణ, ముత్యాలపల్లి తరుణ్ ప్రసాద్, మోహన్ ట్రేడర్స్ వంటి వ్యక్తుల వివరాలున్నాయని ఆంటోనీ గుర్తించారు.

తరువాత లాభాలను విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా, యాప్ స్పందించకుండా పోయింది. WhatsApp ద్వారా మాట్లాడిన నంబరు (8297931135) కూడా సైలెంట్ అయిపోయింది. దీంతో మోసపోయిన విషయం గ్రహించిన ఆంటోనీ cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. బ్యాంకులను సంప్రదించి లావాదేవీల వివరాలు ఇచ్చాడు.

అయితే డబ్బులు వేర్వేరు ఖాతాలకు పంపినందున తిరిగి పొందడం కష్టమని బ్యాంకులు తెలియజేశాయి. ఈ మోసాన్ని ఆర్గనైజ్డ్ డిజిటల్ క్రైమ్‌గా గుర్తిస్తున్నారు.

ఆంటోనీ ప్రజలకు హెచ్చరిస్తూ, “అతి తక్కువ సమయంలో అధిక లాభాలవంటివి నిజం కావడంలేదు. ఇలాంటివి వింటే జాగ్రత్తపడండి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశను మోసగాళ్లు ఉపయోగించుకుంటారు… వాటికి బలి అవకండి."” అని చెప్పాడు. Growbet777 వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News