మీర్పేట్ లో ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

On
మీర్పేట్ లో ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం..
  • కుటుంబ సభ్యుల పైన అనుమానిస్తున్న స్థానికులు మరియు బంధువులు
  • రెండు నెలల క్రితం ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మృతుడు

రంగారెడ్డి జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా  పెద్ద మద్దాలి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరావు అబిడ్స్ లోని బొగ్గులకుంట గవర్నమెంట్ ఉద్యోగి  పే అకౌంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత పది సంవత్సరాల నుండి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి ప్రభు హోమ్స్ కాలనీలో భార్య జయ మరియు కొడుకుతో నివాసం ఉంటున్నాడు. తరచూ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు అవుతున్నాయని స్థానికులు తెలిపారు. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో  వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో మృతదేహాన్ని నీటి సంపులో గుర్తించిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Latest News