కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పై ఉన్న ప్రేమ భారత దేశ త్రివిధ దళాల పై లేదు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్

By Ravi
On
కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పై ఉన్న ప్రేమ భారత దేశ త్రివిధ దళాల పై లేదు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్

రంగా రెడ్డి జిల్లా: ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా మీర్ పేట్, బడంగ్ పేట్ కార్పొరేషన్ ల  ఆధ్వర్యం లో బిజెపి నాయకులు విజయ తిరంగా యాత్ర ను నిర్వహించారు. ఈ యాత్ర  బడంగ్ పేట్ నుండి బాలాపూర్ చౌరస్తా వరకు జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా రూలర్ అధ్యక్షుడు పతంగి రాజ్ గోపాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. భారతదేశ శక్తిని ప్రపంచ దేశాలకు త్రివిధ దళాల పాకిస్తాన్ ఉగ్రవాదుల పై విజయవంతంగా దాడి చేసి నిరూపించారని లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద నీతిని అవలంబిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కి పాకిస్తాన్ పై ఉన్న ప్రేమ మన త్రివిధ దళాల పై నమ్మకం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. త్రివిధ దళాలకు మద్దతుగా విజయ తిరంగా యాత్ర లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని బీజెపి పార్టీ రాజకీయంగా వాడుకోవడం లేదని స్పష్టం చేశారు. బాలాపూర్ లో ఉన్న  రోహింగలను, అక్రమ వలసదారులను ఈ ప్రభుత్వం గుర్తించి తరిమేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వానికి తెలిపారు.

Advertisement

Latest News

స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్.. స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు.. గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి.. ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..
అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..