మిస్సింగ్.. కిడ్నాప్ కేసు పెట్టిందనే హత్య చేశారు. బాలానగర్ డీసీపీ

On
మిస్సింగ్.. కిడ్నాప్ కేసు పెట్టిందనే హత్య చేశారు. బాలానగర్ డీసీపీ

మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పిఎస్ పరిధిలో మంగళవారం జరిగిన తల్లి (అంజలి39) హత్య కేసును పోలీసులు చేదించారు.తెలంగాణ సంస్కృతిక కళాసంఘంలో అంజలి సభ్యురాలిగా గుర్తించారు. గతంలో షాపూర్ నగర్ లోని అంజలి ఇంట్లోనే శివ(19) ఉండేవాడు. గతంలో తల్లి అంజలిపై జీడిమెట్ల పిఎస్ లో కూతురు తేజశ్రీ(16) కేసు పెట్టింది. ఇంట్లో తనని పనిమనిషిలా చూస్తూ, రెండవ భర్త కూతురిపై ప్రేమ చూపుతుందని పిర్యాదు చేసింది. తేజశ్రీ(16) శివ(19)ల ప్రేమని మొదట్లో తల్లి ఒప్పుకుని తర్వాత అడ్డు చెప్పడంతోనే కూతురు తేజశ్రీ(16) హత్యకు ప్లాన్ చేసింది. ఈనెల 19న జీడిమెట్ల పిఎస్ లో శివ(19)పై మిస్సింగ్, కిడ్నాప్ కేసు నమోదు కావడంతో కూతురు ఆగ్రహానికి గురై హత్యకు ప్లాన్ చేసింది. 23న ఇంట్లో ఎవరులేని సమయంలో మెడకు చున్నీతో చుట్టీ ప్రేమికుడు శివ,యశ్వంత్ లు బండరాళ్లు కొట్టే సుత్తితో మోది హత్య చేసినట్టు డిసిపి వెల్లడించారు. నిందితులు తేజశ్రీ(16), శివ(19), యశ్వంత్(17) పై హత్య కేసు నమోదు చేశారు. తేజశ్రీ,యశ్వంత్ లను జువైనల్ హోమ్ కి తరలించారు. శివ(19)ను చర్లపల్లికి తరలించామని బాల్ నగర్ జోన్ డిసిపి సురేష్ కుమార్ తెలిపారు. బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, బాలానగర్ ఏసిపి నరేష్ రెడ్డి, జీడిమెట్ల సీఐ మల్లేశం, జీడిమెట్ల డిఐ కనకయ్య మరియు పోలీస్ సిబ్బంది మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Latest News