HYDERABAD NEWS: జీడిమెట్లలో ప్రేమ కోసం తల్లిని చంపిన కూతురు
మేడ్చల్ జిల్లా: నవమాసాలు మోసి కనిపించిన తల్లి మాట ఆ కూతురికి నచ్చలేదు.. తన కోసం ఆ తల్లిపడ్డ కష్టం కూడా ఆ బాలికకు విలువలేదు. 16ఏళ్లుగా అల్లారుముద్దుగా పెంచిన తల్లికన్నా ప్రేమ ఎక్కువగా భావించింది. అది ప్రేమ కాదు వ్యామోహం అని, చదువుపై శ్రద్ధ పెట్టాలని ఆ తల్లి చెప్పిన మాటలు కూతురికి నచ్చలేదు అంతే అమ్మా అనే మాట, పిలుపు పక్కన పెట్టి కన్నతల్లినే కాటికి చేర్చింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి జరిగింది. NLB నగర్ లో నివాసముండే సట్ల అంజలి(39)ని కూతురు తేజశ్రీ, తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి, తలపై రాడ్డుతో కొట్టి హత్య చేసింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి మందలించిందని కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్లా యశ్వంత్(18)తో కలిసి హత్య చేసింది. తేజశ్రీ(16) పదవ తరగతి చదువుతుంతోంది. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .