ఆరుగంటల శ్రమ... 46లక్షల రికవరీ..
హైదరాబాద్: ఆరుగంటలు శ్రమ పడ్డారు 46లక్షలు రికవరీ చేశారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సిందితుడికి చెక్ పెట్టారు. పాటిగడ్డలో ఉన్న సన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాములోని గోద్రేజ్ లాకర్‌ను పగలగొట్టి ఓ గుర్తుతెలియని నిందితుడు రూ. 46 లక్షలు చోరీ చేశాడని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో Cr. No. 266/2025 కింద BNS సెక్షన్ 331(4), 305 ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితుడు సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ప్యూరేలీకి బస్సులో వెళ్తున్నట్లు సమాచారం లభించింది. వెంటనే బస్‌స్టాండ్లు, డిపోలు, పోలీస్‌స్టేషన్లకు అలర్ట్ ఇచ్చి నిందితుడి ఫోటోలను పంపారు. సీసీటీవీ పుటేజ్‌లు పరిశీలించి అతని ప్రయాణ వివరాలు సేకరించారు. మేడ్చల్ లో ఓ దాబా యజమాని ఫోన్ ద్వారా నిందితుడు కాల్ చేసినట్టు గుర్తించి, అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషించారు. నిందితుడు ప్రయాణించిన బస్సు డ్రైవర్ నుండి సమాచారం సేకరించారు.
అదిలాబాద్ పోలీసుల సహకారంతో మహారాష్ట్ర సరిహద్దులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి దొంగిలించిన మొత్తం రూ. 46.4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి వివరాలు:
పేరు: గిరిధారి సింగ్
వయస్సు: 28 సంవత్సరాలు
నివాసం: ప్యూరేలీ, సారాయి, మధ్యప్రదేశ్
నిందితుడు గతంలో మూడు సంవత్సరాలపాటు ఫిర్యాదుదారుని కంపెనీలో పని చేశాడు. ఆరు నెలల క్రితం అనుచిత ప్రవర్తన కారణంగా ఉద్యోగంలో నుండి తొలగించారు. ఉద్యోగ సమయంలో కార్యాలయ లాకర్‌లో నగదు ఉంచే పద్ధతి గురించి అతనికి అవగాహన ఏర్పడింది. దాంతో అదే లాకర్‌ను లక్ష్యంగా చేసుకొని, జూన్ 20-21 రాత్రి దొంగతనానికి పాల్పడ్డాడు. భవనం పైకప్పులోని ఓ గ్యాప్ ద్వారా లోపలికి ప్రవేశించి గోద్రేజ్ లాకర్‌ను పగలగొట్టాడు.