వాహనదారులకు తీపి కబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !

By Dev
On
వాహనదారులకు తీపి కబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !

గ్రీన్ టాక్స్‌ తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం! కేబినెట్ ఆమోదం!!

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని రవాణా వాహనదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం విధించిన గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 9న అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ టాక్స్ తగ్గించేందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను క్యాబినెట్ ఆమోదించింది.  ఈ నిర్ణయంతో సరకు రవాణా వాహనదారులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా పర్యావరణానికి హాని కలగదని కాలుష్యం పెరగదని భావిస్తున్నారు. 

గతంలో ఏడాదికి రూ.20 వేల వరకు ఉన్న పన్నును తాజా నిర్ణయంతో ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.3 వేలకు తగ్గించారు. గ్రీన్‌ ట్యాక్స్‌ ద్వారా జిల్లాలో ఏటా రూ.18 కోట్లు ఆదాయం వచ్చేది. రవాణా వాహనాలకు ఏడేళ్ల కాలపరిమితి దాటితే గ్రీన్‌ ట్యాక్స్‌ అమలు చేస్తారు. గత ప్రభుత్వం ఒకేసారి రూ.15 వేలకు పెంచేసింది. కేంద్రం కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గించడానికి గ్రీన్ ట్యాక్స్ పెంచే అవకాశం ఇచ్చింది. గత ప్రభుత్వం రాష్ట్రంలో గ్రీన్‌ ట్యాక్స్‌ను బాగా పెంచింది. గతంలో ఏడేళ్లు దాటిన సరకు, ప్రజా రవాణా వాహనాలకు ఏడాదికి రూ.200 ఫీజు ఉండేది. కానీ గత ప్రభుత్వం దానిని మార్చి ఎక్కువ పన్నులు వేసింది. 7-10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, 10-12 ఏళ్ల వాహనాలకు ఒక త్రైమాసిక పన్ను, 12 ఏళ్లు దాటిన వాహనాలకు రెండు త్రైమాసికాల పన్నులు వసూలు చేసే విధానాన్ని 2022 జనవరి 1 నుంచి అమలు చేశారు. దీనివల్ల వాహనదారులపై చాలా భారం పడింది. లారీ యజమానులు చాలా ఇబ్బంది పడ్డారు. వైకాపా ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పన్ను తగ్గించలేదు.

ప్రజా రవాణా వాహనాలకు (బస్సులు, క్యాబ్స్) గతంలో హరిత పన్ను రూ.200 ఉండగా.. గత ప్రభుత్వం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న విధంగానే ఏపీలో కూడా గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించనున్నారు. తెలంగాణలో 7-12 ఏళ్ల వాహనాలకు ఏడాదికి రూ.1,500, 12 ఏళ్లు దాటిన వాహనాలకు రూ.3 వేలు మాత్రమే గ్రీన్ ట్యాక్స్‌గా తీసుకుంటున్నారు. తెలంగాణలో ఎలా ఉందో.. అదే విధంగా ఏపీలో కూడా పన్ను వసూలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ప్రజా రవాణా వాహనాలకు కూడా ఇదే పన్ను విధానం వర్తిస్తుంది.

గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు లారీ యజమానుల సంఘాలతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు గ్రీన్ ట్యాక్స్ తగ్గించి ఊరట కల్పిస్తామన్నారు.. ఇప్పుడు తాజాగా ఆ హామీని నిలబెట్టుకున్నారు. ఈ నిర్ణయంతో రవాణా రంగంలో ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు. పన్ను భారం తగ్గడం వారికి ఎంతో లాభం. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల రవాణా రంగం మరింత అభివృద్ధి చెందుతుందనంలో సందేహం లేదు.

 

OIP

ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలపై ప్రభావం

ఉదాహరణకు, మీరు రూ.70,000 ధర గల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కొంటే.. దాని ఎక్స్‌-షోరూమ్ ధరతోపాటూ.. గ్రీన్ టాక్స్, రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఛార్జీలు అదనంగా ఉంటాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్ 9% నుంచి 12% వరకు ఉంటుంది, గ్రీన్ టాక్స్ రూ.3,000 వరకు ఉండవచ్చు. ఇతర ఫీజులు (రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్) కలిపి సుమారు రూ.10,000 అదనంగా ఉండవచ్చు.

Advertisement

Latest News

సంతకం ఫోర్జరీ చేసి అధ్యక్షుడు అయ్యాడు.. సంతకం ఫోర్జరీ చేసి అధ్యక్షుడు అయ్యాడు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అరెస్ట్ క్లారిటీ ఇచ్చిన సీఐడీనకిలీ పత్రాలు సృష్టించి అధ్యక్ష పదవి పొందారని ఆరోపణలుమాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు...
ఆదూరాన్ని తగ్గించింది... అడ్డుగోడను తొలగించింది..
ప్రభాకర్ రావు అరెస్ట్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్లిన సిట్
కల్తీ ఘటనపై స్పందించిన ఎక్సైజ్.. ఆ దుకాణాల లైసెన్స్ రద్దు..
మల్నాడు కిచెన్ డ్రగ్స్ పై ఈగల్ స్పెషల్ ఫోకస్
బెట్టింగ్ యాప్స్ బెండు తీసేందుకు రెడీ అయిన ఈడీ
పవన్ కళ్యాణ్ సవాల్.. నేను సిద్ధమన్న లోకేష్..!