బోనాల జాతరల్లో మందుకు డోకా లేదు బ్రో..

On
బోనాల జాతరల్లో మందుకు డోకా లేదు బ్రో..

  • బోనాల కోసం మద్యం వ్యాపారుల ముందస్తు జాగ్రత్తలు
    ముందుగానే షాప్ లలో స్టాక్స్ పెంచుకున్న నిర్వాహకులు
    ఈ ఏడాది డబుల్ వ్యాపారం సాగాలని అమ్మవారికి మొక్కులు
    అక్రమ మద్యం అమ్మకాలు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై నిఘా

IMG-20250622-WA0084By. V. Krishna kumar
Tpn: desk
హైదరాబాద్‌ మహానగరంలో జూన్‌ 29 నుంచి జూలై 21 వరకు ఆషాఢమాస బోనాల జాతర సంబరాలు ప్రారంభం కానున్నాయి. పేద, మధ్య తరగతితో పాటు మిగితా వారు కూడ భోనాల పండుగ జరుపుకుంటారు.
బోనాల జాతర అంటే అమ్మవారికి బోనాలు, మేక, గొర్రె పోతులతో మొక్కులు, మద్యoతో శాక పోయడం పరిపాటి.  జాతర సందర్భంగా  ఇంటిల్లీపాదితో పాటు బంధువులను పిలుచుకొని సంబరాలు జరుపుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే మినీ దసరా రీతిలో జరిగే బోనాల జాతరలో మద్యం వినియోగం జోరుగా ఉంటుంది.
జూన్‌, జూలై నెల్లో 10 రోజుల పాటు బోనాల జాతరలు జరుగుతాయి. ఈ సందర్భంగా మద్యo అమ్మకాలు జోరుగా జరుగుతాయని, వ్యాపారులు అవసరమైన స్టాకును సమకూర్చు కోవడానికి అవసరమైన సన్నాహాలు చేపట్టారు. బోనాల జాతర సందర్భంగా జూలై నెలలో భారీగా అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్‌ శాఖ అంచనాల్లో ఉంది.  జాతర సందర్భంగా జరిగే మద్యo అమ్మకాల్లో కల్తీ మద్యం, ఫ్యూరియస్ లిక్కర్‌ వినియోగం,  నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ వినియోగం జరిగే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం ఎస్ టి ఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్‌
డీటిఎప్‌ శాఖలను ఎన్‌డీపీఎల్‌ మద్యం పై అప్రమత్తం చేశారు. 
భోనాల జాతరలు జరిగే తేదీలు ఇవే..
తెలంగాణలో ఆషాడమాసంలో జరిగే బోనాల జాతరలు ఎక్కడెక్కడ  ఎప్పుడెప్పుడు జరుగుతాయనే తేదీలను ముందుగానే ఖరారు చేశారు.
జూన్‌ 29న గోల్కండ, జూలై 2న బల్కంపేట్‌, 4న జూబ్లీహీల్స్‌, 10న  ఉజ్జయిని మహాంకాళీ, 13,14 బోనాల జాతర, 15న చార్మినార్‌, 17న లాల్‌ దార్వాజ, 20న పాత బస్తీ, 21న బోనాల ఘటాల ఊరేగింపుతో  బోనాల జాతర హైదారాబాద్‌ మహానగరం లో పూర్తి అవుతాయి. 
మద్యం  అమ్మకాలపై భారీ అంచనాలు..
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ ప్రాంతాల్లో బోనాల జాతర సందర్బంగా మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. 
గత సంవత్సరం కంటే ఈ సారి మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. 
ఎక్సైజ్‌  శాఖలో 2024-25 సంవత్సరంలో బోనాలు జరిగే జూన్‌, జూలై, ఆగస్టుల్లో మద్యం అమ్మకాలు పరిశీలిస్తే బోనాల జాతర సందర్భంగా మద్యం  అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు రికార్డులు చెపుతున్నాయి.
2024- 25 జాన్‌ నెలలో 30.24 లక్షల పెట్టెల లిక్కర్‌, 39.94  లక్షల బీరు పెట్టెల అమ్మకాలు జరిగాయి. జూలైలో 31.80 లక్షల  పెట్టెల లిక్కర్‌, 47.94 లక్షల పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. ఆగస్టులో 30.86 లక్షల పెట్టెల లిక్కర్‌, 39.77 లక్షల పెట్టెల బీర్లు  అమ్మకాలు  జరిగాయి. ఈ మూడు నెల రికార్డులను పరిశీలించినపుడు బోనాల జరిగిన జూలైలో లక్ష నుంచి లక్షన్నర పెట్టెల లీక్కర్‌, బీరు అమ్మకాలు అధికంగా జరిగాయి.  ఈసారి  అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెలాఖరు వరకు పెద్ద మొత్తంలో మద్యం  నిల్వలను నిల్వ చేసుకోవడానికి  వ్యాపారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
పెరిగిన ఎన్‌పీడీఎల్‌ కేసులు..
ఎన్‌డీపీఎల్‌ నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ కేసులు పరిశీలించినపుడు  2023లో సంవత్సరంలో 176 కేసులు నమోదు అయ్యాయి. కాని జోనాల జాతర జరిగిన జూలై నెలలో ఎన్‌డీపీఎల్‌ కింది 78 కేసులు నమోదు అయ్యాయి.
 2023లో 2940 లీటర్ల మద్యం  సీజ్‌ చేసిన  ఒక్క జూలైలో 1845 లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్‌ శాఖ సీజ్‌ చేసింది. అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలపై 2023లో 133 కేసులు  నమోదు అవుతే.. 2024లో 482 కేసులు నమోదు చేశారు.  2023లో  932 లీటర్ల మద్యాన్ని సీజ్‌  చేశారు. 2024లో 2937 లీటర్ల మద్యాన్ని సీజ్‌  చేశారు.  ఈ సారి జరిగే బోనాల జాతర సందర్భంగా ఎక్సైజ్‌ ఎన్‌ఫొర్స్‌ మెంట్‌ టీమ్‌లు మరింత నిఘా పెట్టి ఎన్‌డీపీఎల్‌, అనుమతులు లేని మద్యం అమ్మకాలు జరుగకుండ చర్యలు తీసుకోవడానికి ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ప్రారంభించింది. 
గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్‌ ఖాసిం తెలిపారు.  హైదరాబాద్‌లో ఇప్పటికే ఎన్‌డీపీఎల్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి  నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. మరో పక్క డిఫెన్స్  లిక్కర్‌పై ప్రత్యేక ఫోకస్‌తో దాడులు  నిర్వహిస్తున్నారు. బోనాల జాతర సందర్భంగా ఇతర  రాష్ట్రాల నుంచి లిక్కర్‌ను రాకుండా గట్టి నిఘా పెట్టారు. స్థానికంగా ఫ్యూరియస్ లిక్కర్‌ను  అరికట్టకట్టడానికి చర్యలు చేపట్టారు. సో మందు విందుకు ఇక హైదరాబాద్ వాసులకు డోకా లేదని తెలుస్తోంది.

Advertisement

Latest News