ఐపీఎల్‌ లో గుజరాత్‌ టీమ్ హవా..

By Ravi
On
ఐపీఎల్‌ లో గుజరాత్‌ టీమ్ హవా..

ఐపీఎల్‌ 2025లో గుజరాత్‌ టైటాన్స్‌ హవా కంటిన్యూ అవుతుంది. ఇప్పుటి వరకు ఈ టీమ్ 8 మ్యాచ్ లు ఆడింది. వాటిల్లో 6 విన్ అయ్యింది. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లో పంజాబ్ టీమ్ తో ఓడిపోయింది. ఆ తర్వాత లక్నో టీమ్ తో ఓడిపోయింది. తర్వాత ఢిల్లీ, కోల్ కతా టీమ్స్ పై విజయాలు అందుకుంది. కోల్ కతాపై విజయంతో గుజరాత్ టాప్ లో నిలిచేలా చేసింది. ఈ క్రమంలో ప్రజంట్ గుజరాత్‌ అకౌంట్ లో 12 పాయింట్స్ ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జీటీ అగ్రస్థానంలో ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే.. అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక ఐపీఎల్ 2025లో ప్రసిద్ధ్‌ కృష్ణ అద్భుతంగా రాణిస్తున్నాడు. 

నిన్న జరిగిన కోల్‌కతా టీమ్ తో జరిగిన మ్యాచులో 2 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 8 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచాడు. ప్రస్తుతానికి ఐపీఎల్ 2025లో పాయింట్ల పట్టిక, ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ అన్ని కూడా గుజరాత్‌ టైటాన్స్‌వే కావడం విశేషం. ప్రస్తుతం అన్నీ జీటీవే కావడంతో గుజరాత్‌ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఐపీఎల్ కప్ గుజరాత్ సొంతం అవుతుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related Posts

Advertisement

Latest News

మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
పవిత్ర జంధ్యాల..శ్రావణ పౌర్ణమి సందర్భంగా మీర్ పేటలోని శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, సామూహిక నూతన యజ్ఞోపవీత...
నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు
రుద్రారంలో తోషిబా అధునాతన తయారీ కేంద్రం ప్రారంభం
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యా ప్రేరణ
ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..
ఇక అదిరిపోనున్న హైదరాబాద్..
సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం