ఎయిర్ రైఫిల్ లో భారత్ కు గోల్డ్..
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎలవేనిల్ వలరివన్, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా కంచు పతకం సాధించగా.. ఈరోజు సురుచి సింగ్ పసిడి పతకంతో దేశం గర్వపడేలా చేసింది. మ్యునిచ్ నగరంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ పోటీల్లో ఆమె వరుసగా మూడో పతకం గెలుపొందడం హైలెట్. ఏప్రిల్ నెలలో బునోస్ ఏరిస్‌లో గోల్డ్ తో మెరిసిన సురుచి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మెడల్ లోనూ సాధించింది. వ్యక్తిగత విభాగంలో 19 ఏళ్ల అమ్మాయి హ్యాట్రిక్ మెడల్ సాధించింది. ఇక ఫైనల్లో సుచీకి ఫ్రాన్స్‌కు చెందిన కమిల్లె నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరి షాట్‌లో భారత షూటర్ 10.5తో 24.19 పాయింట్లు సాధించి అగ్రస్థానం సొంతం చేసుకుంది. దాంతో 9.8 మార్క్ కు పరిమితమైన కమిల్లె 241.7తో వెండి పతకం అందుకుంది.