తెలంగాణలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్...

By Ravi
On
తెలంగాణలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్...

డ్రగ్స్ దందాలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్
వీసా గడువు పూర్తయిన ఇక్కడే తిష్ట వేసేందుకు మాస్టర్ ప్లాన్
భారతీయ మహిళలను టార్గెట్ చేసిన దుండగులు
షెల్ కంపెనీల ద్వారా తమ దేశానికి డబ్బు రవాణా
అప్రమత్తమైన యాంటీ నార్కోటిక్ బ్యూరో బృందాలు

_118231516_ghanapolicearrestillegalnigerianimmigrants.jpgతెలంగాణ రాష్ట్రంలో అందులోనూ హైదరాబాద్ లో నైజీరియన్స్ పెద్ద స్కెచ్ వేశారు. డ్రగ్స్ దందాలో కొనసాగాలంటే ఇక్కడే తిష్ట వేయాలని భావిస్తున్నారు. అందుకోసం రకరకాల పద్ధతుల్లో తమ ప్లాన్ అమలు చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. వీసా గడువు పూర్తయిన వెంటనే తమ దేశానికి వెళ్లిపోకుండా ఉండాలంటే మాస్టర్ ప్లాన్ వేసి మరి ఇక్కడే స్థిరపడిపోతున్నారు. ఇటీవలే తెలంగాణ యాంటీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చేసిన సర్వేలో విస్సుపోయే నిజాలు బయట పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారి ఎత్తులను చిత్తు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 
తెలంగాణలో చదువు కోసం అంటూ ఇక్కడికి వస్తున్న నైజీరియన్స్ డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్నారు. గతంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ప్రస్తుతం యాంటీ నార్కోటిక్ బృందాలు చేసిన దాడుల్లో అనేక మంది పట్టుబడి జైలుపాలయ్యారు. వీరంతా తమ దేశం నుండి వచ్చి  హుమాయన్ నగర్, మెహదీపట్నం, లంగర్ హౌజ్, టోలిచౌకి, గోల్కొండ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. చదువు సాకుతో హైదరాబాద్ కి వచ్చి డ్రగ్స్ వ్యాపారంలో విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నారు. దీనిపై ఫోకస్ పెట్టిన అధికారులకు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. 
డ్రగ్స్ కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్న నైజీరియన్లను
ఇప్పటికే అనేక మందిని డిపోర్టేషన్ చేసిన హైదరాబాద్ పోలీసులు వారి గురించి ఆరా తీశారు.  జైలు నుంచే సెల్‌ఫోన్ల ద్వారా డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు అధికారుల విచారణలో తేలిందని తెలుస్తోంది. బయట ఉన్న తమ వారితో నకీలీ గుర్తింపు కార్డులను తయారు చేసుకొని దేశంలోనే తిష్ట వేస్తున్నట్లు తెలిసింది. వీసా గడువు ముగిసినా మన దేశంలో ఉండేందుకు తమపై తామే కేసులు నమోదు చేయించుకుంటున్న నైజీరియన్లు భారతీయ మహిళలను పెళ్లిళ్లు చేసుకొని ఇక్కడే ఉండేందుకు సిద్ధపడుతున్నట్లు తెలియడంతో నార్కోటిక్ బ్యూరో అధికారులు వారి వివరాలు సేకరిస్తున్నారు. డ్రగ్స్ కి బానిసైన మహిళలను లో బర్చుకొని వారిని పెళ్లిళ్లు చేసుకొని మరీ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో నైజీరియన్లు ఈ పెళ్లిళ్ల స్కెచ్ లో సక్సెస్ అయినట్లు తేలింది. 
డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే నగదును షెల్ కంపెనీలకు మళ్లిస్తున్న ముఠా ఆయా షెల్ కంపెనీ నుంచి నైజీరియానికి నగదు బదిలీ చేస్తున్నట్లు తేలడంతో అధికారులు వాటిపై నిఘా పెంచారు. గతంలో నైజీరియన్స్ వుండే ప్రాంతాల్లో సోదాలు చేసి గడువు ముగిసిన వారి భరతం పట్టె పోలీసులు కొద్దిగా విరామం ఇవ్వడంతో ఈ ముఠాలు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ మహిళలను పెళ్లిళ్లు చేసుకోవాలంటే ముందుగా ప్లాన్ చేసి వారిని డ్రగ్స్ కి బానిసగా మార్చి మరీ ఘాతుకానికి ఒడిగడుతున్నారని తెలిసిన అధికారులు గతంలో పట్టుబడి జైల్ నుండి బయటకు వచ్చిన వారి కదలికలపై నిఘా పెట్టారు. మొత్తానికి చదువు అంటూ మన దేశం.. ప్రాంతానికి వస్తున్న నైజీరియన్స్ వేస్తున్న ఎత్తుగడలు అధికారులను సైతం ఆలోచించేలా చేస్తున్నాయి. వారి ప్లాన్స్ తలకిందులు చేసేందుకు యాంటీ నార్కోటిక్ బృందాలు ఓ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

Tags:

Advertisement

Latest News

మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం! మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?