పిల్లర్ నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
By Ravi
On

ఉప్పల్ భగాయత్ లో కలకలం రేగింది. నిన్న అదృశ్యమైన ఇద్దరు పిల్లలు భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతి చెందారు. సుజాత, వెంకటేష్ దంపతులకు ముగ్గురు సంతానం. ఒక కూతురు, ఇద్దరు కుమారులు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన వీరు ఉప్పల్ కుర్మానగర్ ఫ్లై ఓవర్ పనుల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరి పిల్లలు మణికంఠ, అర్జున్ ఆడుకుంటూ మంగళవారం కనిపించకుండా పోయారు. వారి కోసం గాలించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఉదయం భగాయత్ లో కుల సంఘాల భవనానికి కేటాయించిన భూమిలో భవన నిర్మాణం కోసం పిల్లర్ గుంతలో పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన డిఆర్ఎఫ్ బృందాలు అర్జున్ డెడ్ బాడీనీ బయటకు తీశారు. మణికంఠ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఇది ప్రమాదమా లేక ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News

24 Jul 2025 17:12:22
ఒరిస్సా టూ హైదరాబాద్ గంజాయి రవాణ అవుతున్న విషయం తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీమ్లు మాటు వేసి పట్టుకున్న 8.6 కేజీల గంజాయి