గిల్‌ కు కెప్టెన్సీ భారం కాదు: విక్రమ్‌

By Ravi
On
గిల్‌ కు కెప్టెన్సీ భారం కాదు: విక్రమ్‌

గుజరాత్‌ మ్యాచ్ ప్రజంట్ ఐపీఎల్‌ 2025 సీజన్‌ లో కేవలం 10 మ్యాచుల్లోనే 14 పాయింట్లతో 4వ స్థానంలో కంటిన్యూ అవుతుంది. లాస్ట్ సీజన్‌ నుంచి కెప్టెన్‌ గా వ్యహరిస్తున్న యంగ్ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ తన క్యారెక్టర్ ను అద్భుతంగా రన్ చేస్తున్నాడు. ప్రెషర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈవిషయమై గుజరాత్‌ టైటాన్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ విక్రమ్‌ సోలంకి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక జట్టుకు బాధ్యతల భారాన్ని మోస్తూ.. రాణిస్తున్న క్రికెటర్లలో శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఒకడు. అతడు నాయకత్వ పాత్ర పోషించడంలో పరిణితి సాధించాడు. గిల్‌ ప్రతిభావంతమైన బ్యాటర్‌. కెప్టెన్‌గా వ్యహరించే సమయంలో ఒత్తిడికి లోనవుతాడేమో అని క్రీడాభిమానులు మొదట్లో అనుకున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం అలాంటిదేమీ లేదు. కేవలం ఆటగాడిగా రాణించడమే కాదు.. కెప్టెన్సీలోనూ గిల్‌ తన మార్క్‌ చూసిస్తున్నాడు అని విక్రమ్‌ సోలంకి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 


కాగా ఐపీఎల్‌ లో శుభ్‌మన్‌ గిల్‌ గత మూడు సీజన్లుగా నిలకడగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. 2023 సీజన్‌లో 890 పరుగులు సాధించి, ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 2024లో 12 మ్యాచులు ఆడిన గిల్‌ 426 రన్స్‌ చేశాడు. 2025లో ఇప్పటికే శుభ్‌మన్‌.. కేవలం 10 మ్యాచుల్లోనే 465 పరుగులు చేసి కరెక్ట్ ఫామ్‌ లో కంటిన్యూ అవుతున్నారు.

Advertisement

Latest News

ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్ ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
సరూర్‌నగర్‌ మన్సూరాబాద్ లో అక్షయ్‌ కుమార్‌(30) తన ఇంట్లో చిన్న సైజ్ వైన్ షాప్ ఓపెన్ చేశాడు. పలు రాష్ట్రాల నుండి నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌...
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం
సంధ్య మినీ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన హైడ్రా