లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!
By Ravi
On

సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దుర్వాసికి రూ.66,572, తండ్యాల తవిటి రాజుకి రూ.4,10,000, సామవరపు స్రవంతికి రూ.10,00,000 చెక్కులను తన కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడిచినా వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలే పరమావధిగా పాలన సాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పేదలను ఆదుకుంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Related Posts
Latest News

16 Sep 2025 10:59:43
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై సీరియస్ ఫోకస్..కల్తీలపై నిఘా పెట్టాలని ఆదేశాలుఈనెల 30వరకు స్పెషల్ డ్రైవ్ చేయనున్న ఎక్సైజ్.