లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!

By Ravi
On
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!

సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దుర్వాసికి రూ.66,572, తండ్యాల తవిటి రాజుకి రూ.4,10,000, సామవరపు స్రవంతికి రూ.10,00,000 చెక్కులను తన కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడిచినా వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలే పరమావధిగా పాలన సాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పేదలను ఆదుకుంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
* 305 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన సిట్ * చార్జ్‌షీట్‌లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావన* దోపిడీకి వీలుగా మద్యం విధానం రూపకల్పన* అంతిమ లబ్ధిదారుకు...
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?
ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!
హరిహరవీరమల్లు...అ'ధర'హో అంటున్న టికెట్ రేట్లు!
ఏపీ పెట్టుబడులపై చర్చకు దారితీసిన ఓ యాడ్..! ఏంటా కథ?
కాంగ్రెస్ నీ వ్యక్తిగత సామ్రాజ్యమా? సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్