పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం

By Ravi
On
పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం

R.srinubabu.PithaPuram..
TPN..
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర కు మన ఊరూ మన బాధ్యత స్వచ్చంధ సేవా సంస్థ అధ్యక్షులు కార్యదర్శులు పిఠాపురం పట్టణంలో వున్న సమస్యలు పైన పిర్యాదు చేయటం జరిగింది.పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఆనుకొని వున్న హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు చేసిన తరువాత స్నానాలు చేయుటకు నీటి సదుపాయం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున స్మశాన వాటికలో బోరు వేయించి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలు స్నానాలు చేయుటకు సదుపాయాలు కల్పించాలని పిర్యాదు చేయటం జరిగింది.పిఠాపురం పట్టణంలో మెయిన్ రోడ్డు గత 10 సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణ పేరుతో RRBHR కళాశాల స్థలాన్ని తీసుకొన్నారు అక్కడ మధ్యలో వున్న ప్రైవేటు స్థలాలు వదిలేశారు దానివల్ల రోడ్డు ఇరుకుగా వుండి వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.కాళీ చేసిన స్థలంలో పురపాలక సంఘం వారు చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించి ఆ కాళీ చేసిన స్థలం ఆక్రమించారు కావున మిగిలిన ప్రైవేటు స్థలాలు కాళీ చేసి రోడ్డు విస్తరణ చేయండి లేకపోతే మా కళాశాల స్థలం మాకు ఇప్పించండి అని పిర్యాదు చేయటం జరిగింది. పరిష్కారం చేయని యెడల న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాము అని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో మన ఊరూ మన బాధ్యత స్వచ్చంధ సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, పెమ్మారాజు సత్య రామచంద్రరావు మరియు చింతపల్లి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

వ్యాపారం చిన్నదే.. ఆదాయమే కోట్లలో.. వ్యాపారం చిన్నదే.. ఆదాయమే కోట్లలో..
నకిలీ మద్యం లేబుల్స్ తయారీ యూనిట్ పై దాడి.. గుట్టుగా సాగుతున్న వ్యాపారం రట్టు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్.. సూర్యాపేటలో తీగ లాగితే.. శివార్లలో...
మియాపూర్ లో కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన అయిదు మంది మృతి
రామాంతపూర్ లో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి..
హమ్మయ్య సిటీలో ఇక పార్కింగ్ కష్టాలు లేనట్లే..
జూలో ఘనంగా సింహాల దినోత్సవం..
మూసీ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
కంటిమీద కునుకులేదు.. ఇంటి వైపు చూసింది లేదు..