నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య..!

By Ravi
On
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య..!

మేడ్చల్ TPN : పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని అంన్నోజిగూడ నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి జశ్వంత్ పురుగులమందు తాగి సూసైడ్‌కు పాల్పడ్డాడు. జగిత్యాల హనుమాన్ వాడకు చెందిన జశ్వంత్, నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని, రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఐతే.. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో..మొదటి సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం ఉదయం 6 గంటల సమయంలో నారాయణ జూనియర్ కళాశాలలో పురుగుల మందు సేవించాడు. అది గమనించిన కళాశాల సిబ్బంది హుటాహుటీన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ జశ్వంత్ మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Latest News