నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇక నుండి ఈగల్.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పనిచేసే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇక నుంచి 'ఈగల్' అని పిలవనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రద్ద ఎలాగైతే పైనుంచి చూసి టార్గెట్ మిస్సవ్వకుండా ఎటాక్ చేస్తుందో అదే మాదిరిగా ఈగల్.. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు అమ్మే వారిపై టార్గెట్ చేసి కట్టడి చేస్తుందని తెలిపారు. ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్ (Eagle Elite Action Group for Drug Law Enforcement ) అని వివరించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడేందుకు 'ఈగల్' అనే ఆర్గనైషన్ గా క్రియేట్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ లో ఉన్న ఒక కోటి 50 లక్షల ఎకరాలలో ఎక్కడ గంజాయి పండించినా ఈగల్ కట్టడి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
డ్రగ్స్ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రభుత్వమో, పోలీసులో తలచుకుంటేనే డ్రగ్స్ నిర్మూలన జరగదని.. అందరూ భాగస్వామ్యం అయినప్పుడే డ్రగ్స్ కట్టడి చేయవచ్చునని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
తెలంగాణ టార్గెట్ బెంగళూర్, ముంబై, ఢిల్లీ కాదని.. తమ టార్గెట్ న్యూయార్క్ అని అన్నారు. న్యూయార్క్ స్థాయిలో డెవలప్ చేసేందుకు తెలంగాణలో 68 శాతం యువత ఉందని అన్నారు. యువతకు నైపుణ్యాల కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో నిలబెడతామని ఈ సందర్భంగా తెలిపారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఇంటర్నేషన్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం, సినీ నటులు రామ్ చరణ్, విజయదేవరకొండ, నిర్మాత దిల్ రాజ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, చేవెళ్ల బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.