ఇక డే అండ్ నైట్ అట.. బాబులు.. బీ కేర్ఫుల్..

On
ఇక డే అండ్ నైట్ అట.. బాబులు.. బీ కేర్ఫుల్..

  • నడ్డివిరిచేందుకు రెడీ అయిన సిటీ పోలీసులు
    ఎప్పుడుపడితే అక్కడ ఇక టెస్టులు
    తాజా ఉత్తర్వులు ఇచ్చిన కమిషనర్ సి.వి. ఆనంద్

drunk-drivingBy. V. Krishna kumar 
Tpn: స్పెషల్ డెస్క్..
మందుబాబులు బహుపరాక్.. మీరు తాగింది దింపడానికి లేక మత్తు దిగే వరకు కక్కడానికి పోలీసులు రెడీ అయ్యారు. అందు కోసం ఓ తాజా ఆదేశాలు అందుకున్నారు. ఇక ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ తాగకండి.. తాగాలి అనిపిస్తే ఇంట్లో తాగండి.. అక్కడే ఉండండి.. లేదా ర్యాపిడో.. ఓలా.. ఉబర్ ఇలా అద్దె వాహనాల్లో జాగ్రత్తగా ఇంటికి చేరండి.. లేదు మా మందు మా ఇష్టం.. అంటే మీ జీవితం జైలుపాలే.. ఆ ఇది రొటీన్ డైలాగ్ ఇందులో ఏముంది.. ఎప్పుడు చెప్పేదేగా.. సోషల్ మీడియాలో, లేదా టీవీలో ప్రచారమే అనుకుంటే ఇంక మీ ఇష్టం.. కష్టం కోరి తెచ్చుకున్నట్లే.. ఇంతకీ విషయం విషయం సింపులే.. కానీ పనిష్మెంట్ పెయిన్ ఫుల్..
మన సిటీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో తాగి వాహనం నడిపే వారి కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. అది రాత్రి సమయంలో. సడన్ గా ఓ ఏరియా.. టైం డిసైడ్ చేసి ఆ ప్రాంతంలో స్థానిక పోలీసులు కాకుండా మరో ఏరియా పోలీసులు వచ్చి బ్యారికేడ్స్ వేసి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. అలా టెస్ట్ లో మద్యం తగినట్లు వచ్చి పాసైన వారికి కౌన్సెలింగ్ ఆ తరువాత కోర్ట్ కి తీసుకు వెళ్తారు.. కోర్ట్ లో మొదట పనిష్మెంట్ ఆ తరువాత జరిమానా.. మూడోసారి ముచ్చటగా జైల్. ఇది మన అందరికి తెలుసు. మొదట్లో వీకెండ్ లో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు చేసేవారు. ఆ తరువాత లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. వారం రోజుల్లో రెండు రోజులు వుండే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిత్యం నైట్ చేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో చాలా మంది సినిమా వాళ్లు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు, సాఫ్ట్, హార్డ్ వేర్ ఉద్యోగులు అబ్బో వందల సంఖ్యలో పట్టుబడిన సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఫ్రెష్ గా నగర పోలీసులు కమిషనర్ సి.వి. ఆనంద్ మరో నిర్ణయం తీసుకున్నారు. తన కమిషనరేట్ పరిధిలో డే అండ్ నైట్ 24 గంటలు ఈ టెస్ట్ వాహనదారులకు చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. 
అంటే సమయం అంటూ ఏమి ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మీ వాహనం నెంబర్ ప్లేట్ ట్యాబ్ లో కొట్టి ఎలాగైతే జరిమానా ఉంటే వాహనం పక్కకి తప్పించి సీజ్ చేస్తారో అచ్చం అలాగే రోడ్లపై వుండే ప్రతి పోలీస్ అధికారి చేతుల్లో వుండే బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తారు. డే లోనే తాగారు అనుకో అక్కడి నుండే నేరుగా కోర్ట్ కి తీసుకు వెళ్లి మీ మత్తు వదిలిస్తారు. ఇక ఇదే సిటీలో జరగబోతోంది. రాత్రి తప్పతాగి అక్కడే పడుకొని ఉదయాన్నే హ్యాంగోవర్ తో వెళ్లిన ప్రమాదమే చూడండి మరి. అందుకే తాగండి వద్దు అనం.. తాగి రోడ్లపైకి రాకండి అంటున్నారు పోలీసులు. ఇదంతా ఇటీవల కాలంలో పగలు రోడ్లపై జరుగుతున్న ప్రమాదలపై అధ్యాయనం చేసిన సిపి వాటిలో సాగానికి పైగా మద్యం మత్తు అని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
వాస్తవానికి డ్రంక్ అండ్ డ్రైవ్.. తాగి వాహనం నడపడం నేరం అని మన చట్టంలోనే ఉంది. కానీ ఆ చట్టాన్ని ఏ ప్రభుత్వం, ఏ అధికారి అమలు చేయలేదు. ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా సి.వి. ఆనంద్ ఉన్న సమయంలోనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మొదలు పెట్టారు. ఇంతింతై వటుడింతై అనే సామెత విన్నారు కదా అలా ఆనంద్ మొదలు పెట్టిన ఈ టెస్ట్ మొత్తం సిటీనే కాదు స్టేట్ నే షేక్ చేసింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మొత్తం పోలీస్ విభాగంలో వ్యాపించేలా చేశారు. మరి మళ్లీ ఆయనే నైట్ ఉన్న డ్రైవ్ ను డే అండ్ నైట్ అన్నారు.. దీన్ని కూడా రాష్ట్రంలో అమలు చేస్తే మందుబాబుల పరిస్థితి ఏంటో అయోమయంగా ఉంది.

Advertisement

Latest News