కెప్టెన్సీ పై కోహ్లీ సెన్సేషనల్ కామెంట్స్

By Ravi
On
కెప్టెన్సీ పై కోహ్లీ సెన్సేషనల్ కామెంట్స్

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి హ్యూజ్ ఫ్యాన్‌ బేస్ ఉంది. పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌ తో కోహ్లీ టీమ్‌ ను ముందుండి నడిపించే తీరు అద్భుతమనే చెప్పాలి. అయితే అటు ఇండియన్ టీమ్ తో పాటు ఇటు ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్సీకి కూడా అతడు దూరంగా ఉంటున్నాడు. తాజాగా దీనిపై అతడు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బెంగళూరు టీమ్ బాధ్యతల నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను ఆయన షేర్ చేసుకున్నారు. ఐపీఎల్ 2016 నుంచి ఐపీఎల్ 2019 వరకు మూడు సీజన్ల పాటు తనపై తీవ్రంగా ఒత్తిడి ఉండేదన్నాడు కోహ్లీ. 

గేమ్‌ లో బ్యాటర్‌ గా సక్సెస్ అవడంతో పాటు సారథిగానూ తనపై అంచనాలు పెరిగిపోయాయని చెప్పాడు. అటు టీమిండియాతో పాటు ఇటు బెంగళూరు టీమ్ విషయంలోనూ ఎక్స్‌పెక్టేషన్స్, ప్రెజర్ ఎక్కువవడంతో కెప్టెన్సీకి దూరంగా ఉంటున్నానని అతడు రివీల్ చేశాడు. బ్యాటింగ్‌ తో పాటు కెప్టెన్సీలోనూ సక్సెస్ అవ్వాలనే అంచనాలతో తాను చాలా సఫర్ అయ్యానని కోహ్లీ వాపోయాడు. 24 గంటలు ఇదే ఆలోచనతో ఉండేవాడ్ని అని.. దీన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయానని కామెంట్ చేశారు. అందుకే ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో పాటు విజయాలు, ట్రోఫీల కంటే ప్రజల ఆదరాభిమానాలే తనకు ముఖ్యమని కోహ్లీ స్పష్టం చేశాడు.

Related Posts

Advertisement

Latest News