మధురానగర్‌లో రౌడీమూకల దౌర్జన్యం.. ఫ్టాట్ ఖాళీ చేయాలని కుటుంబంపై దాడి..!
By Ravi
On
.jpeg)
హైదరాబాద్ TPN : మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాస నగర్‌లోని నాలుగో అంతస్తులో అద్దెకు ఉండే కుటుంబాన్ని కొందరు రౌడీ మూకలు శారీరకంగా దాడి చేసి బలవంతంగా ఫ్లాట్ ఖాళీ చేయాలని బెదిరించారు. కుటుంబానికి ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి రౌడీ మూకలు బలవంతంగా ఫ్లాట్‌లోకి చొరబడి, అక్కడ నివసిస్తున్న వారిని కొట్టి బయటికి తరిమేయాలని ప్రయత్నించారు. వెంటనే విషయం తెలుసుకున్న ఓనర్, పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకతో రౌడీ మూకలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Related Posts
Latest News

25 Jul 2025 11:20:13
కుత్బుల్లాపూర్, జూలై 24. పెట్ బషీరాబాద్ లోని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సోలిస్...