ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

On
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

మేడ్చల్ జిల్లా ఆదర్శనగర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం

యాంప్లిఫోన్ హియరింగ్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్

మేడ్చల్ జిల్లా, జూన్ 8: ఐడిపిఎల్ ఆదర్శనగర్‌లో యాంప్లిఫోన్ హియరింగ్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో సుమారు 250 నుంచి 300 మంది వరకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ అభిషేక్ చౌదరి మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో మా 16 బ్రాంచ్‌ల ద్వారా ప్రజలకు నమ్మకమైన మరియు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నాం. ఉత్తమ వైద్యుల మార్గదర్శకత్వంతో ఆధునిక టెక్నాలజీ పరికరాల ద్వారా పరీక్షలు జరుగుతున్నాయి. ప్రజలకు మరింత చేరువ కావడమే మా ఉద్దేశ్యం,” అని తెలిపారు.

అదే విధంగా, హాస్పిటల్ ప్రత్యేకతను ప్రజలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ హెల్త్ క్యాంప్ ఒక అవకాశం అని పేర్కొన్నారు. “ఒక్కసారి మా హాస్పిటల్‌కి వచ్చి, మా సేవలను పరిశీలించండి” అని ఆయన కోరారు.

ఈ కార్యక్రమం ఆదర్శనగర్ అధ్యక్షుడు శంకరయ్య, బి. శివ కుమార్ సమక్షంలో సజావుగా కొనసాగింది. డాక్టర్ జయ, మేనేజర్ శ్రీకాంత్, సజన్, కావలి వెంకటేష్‌తో పాటు కాలనీవాసులు భారీగా పాల్గొన్నారు.

Advertisement

Latest News

లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే..! లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే..!
* ముందస్తు వ్యూహం ప్రకారమే లిక్కర్ స్కామ్ * మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే * అసలు సూత్రధారులు జగన్, భారతి * ముడుపుల ద్వారా...
మిథున్ అరెస్ట్ రాజకీయ కుట్ర.. వైసీపీని ఏమీ చేయలేరన్నజగన్
మిథున్ రెడ్డికి రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు
అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ 2.0..! ఇళ్ల వద్ద నుంచే రిజిస్టర్‌ పోస్టు బుకింగ్‌ సేవలు!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..సామాన్య ప్రజలకు ఇక్కట్లు!
మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..!
సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...