జీడిమెట్లలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటన.. మీడియాపై దాడి..
By Ravi
On
మేడ్చల్: రామ్ రెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారి ని కలుపుతూ ఫాక్ సాగర్ చెరువు పక్కనుండి వెళ్ళే 100 ఫీట్ల రోడ్డువిస్తరణ పనులను అలాగే జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో గల స్టీల్ బ్రిడ్జ్ ను కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. సుమారు 480 ఎకరాల విస్తీర్ణం గల ఫాక్ సాగర్ చెరువు మరియు అందులో నుండి వెళ్లే నాలా కబ్జా కు గురైందని కమిషనర్ కు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు చెరువు కబ్జాకు గురవుతుందని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన కబ్జా రాయుళ్లతో కుమ్మక్కై, అక్రమార్జనకు తెరలేపారని కమిషనర్ కు తెలిపే ప్రయత్నం స్థానికులు చేశారు.దీనితో ఇరిగేషన్ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఇదంతా కవర్ చేస్తున్న మీడియాపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కెమెరాలు, ఫోన్ లు ధ్వంసం చేశారు. ఇరిగేషన్ సిబ్బంది దాడిని జర్నలిస్టులు మండిపడ్డారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.
Latest News
22 Sep 2025 18:02:04
1704 ఇతర రాష్ట్రాల మద్యం సీజ్గడిచిన పదేళ్లలో ఈ సరే అధికం అని చెప్పిన అధికారులుసిటీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, జిల్లాలో నాటుసారా స్వాధీనం..మరో వారం...