ఇరాన్ పోర్టులో భారీ పేలుడు..

ఇరాన్ లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న షాహిద్ రాజాయి పోర్టులో నేడు భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో 47 మంది గాయపడ్డారు. ఒమ్మాన్‌లో అమెరికాతో అణ్వాయుధ అంశంపై అమెరికా చర్చలు చేపడుతున్న నేపథ్యంలో ఈ పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఏ కారణం చేత పోర్టులో పేలుడు జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ షాహిద్ రాజాయి పోర్టులో ఉన్న అనేక కంటేనర్లలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వైద్య చికిత్స కోసం తరలిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
కాగా సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. ఈ మంటల్ని ఆర్పేందుకు పోర్టు కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. ఆ ప్రమాదంలో బహుశా అనేక మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే వివరాలు త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. కాగా 47 మందికి పైగా గాయపడ్డారని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Latest News
