Category
#Isnapur
తెలంగాణ  హైదరాబాద్  

ఇస్నాపూర్ 13వ వార్డులో ఆపిల్ గుర్తుతో లక్ష్మి నర్సింహా రెడ్డి ప్రచార జోరు

ఇస్నాపూర్ 13వ వార్డులో ఆపిల్ గుర్తుతో లక్ష్మి నర్సింహా రెడ్డి ప్రచార జోరు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా ఆపిల్ గుర్తుతో పోటీ చేస్తున్న అల్లం రెడ్డి గారి లక్ష్మి నర్సింహా రెడ్డి ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల స్వయంగా వార్డ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. శుభ్రతే అభివృద్ధికి తొలి అడుగు అన్న...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

​ఓటు అడగడమే కాదు.. ఊడ్చి చూపిస్తున్నారు:

​ఓటు అడగడమే కాదు.. ఊడ్చి చూపిస్తున్నారు: ​ఇస్నాపూర్: సామాన్యంగా ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి "నన్ను గెలిపించండి.. మీ కష్టాలు తీరుస్తాను.. మీ వార్డును క్లీన్ చేస్తాను" అని హామీల వర్షం కురిపిస్తారు. కానీ, ఇస్నాపూర్ మున్సిపాలిటీ 13వ వార్డులో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. గెలిచిన తర్వాత చూద్దాం అనే ధోరణి కాకుండా, "ముందు పని చేసి చూపిస్తా.. ఆ తర్వాతే ఓటు అడుగుతా" అంటూ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మి, నరసింహారెడ్డి వినూత్నంగా దూసుకుపోతున్నారు. ​సమస్య కనిపిస్తే చాలు.. రంగంలోకి!​ప్రచారంలో భాగంగా లక్ష్మి, నరసింహారెడ్డి కాలనీల్లో పర్యటిస్తున్నప్పుడు, ప్రజలు తమ వార్డులోని డ్రైనేజీ సమస్యలు, పేరుకుపోయిన చెత్త గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా ఎవరైనా "నేను గెలవగానే ఇవన్నీ క్లీన్ చేయిస్తా" అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ నరసింహారెడ్డి మాత్రం అక్కడికక్కడే స్పందిస్తూ, మున్సిపల్  సిబ్బందిని పిలిపించి వార్డులో పేరుకుపోయిన చెత్తను, మురికిని శుభ్రం చేయిస్తున్నారు. ​ప్రజల మన్ననలు.. హర్షం!​ప్రచారంలో ఉండగానే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో స్థానిక కాలనీవాసులు ఆశ్చర్యపోతున్నారు.*​మాటలు కావు.. పనులు ముఖ్యం:* "చాలామంది ఓట్ల కోసం వస్తారు, కానీ ఈయన మాత్రం సమస్యను చూడగానే పరిష్కరిస్తున్నారు" అని కాలనీవాసులు కొనియాడుతున్నారు.​నిజమైన నాయకత్వం: పదవి రాకముందే బాధ్యతగా మెలుగుతున్నలక్ష్మి,నరసింహారెడ్డి తీరుపై సోషల్ మీడియాలోనూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ​వార్డులో హాట్ టాపిక్‌గా మారిన 'క్లీన్' ప్రచారం​కేవలం మైకులు పట్టుకుని ఊదరగొట్టడం కంటే, ఇలా ప్రత్యక్షంగా కాలనీల రూపురేఖలు మార్చడం ఓటర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పారిశుధ్యంపై ఆయన చూపిస్తున్న చొరవతో 13వ వార్డులో లక్ష్మి,నరసింహారెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.రాజకీయ నాయకులంటే కేవలం ఎన్నికల వేళ కనిపించేవారు కాదని, నిరంతరం ప్రజల మధ్య ఉండి పనిచేసేవారే నిజమైన నాయకులని లక్ష్మి, నరసింహారెడ్డి నిరూపిస్తున్నారు. ఈ వినూత్న ప్రచారం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.
Read More...

Advertisement